https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యేలోపు..మరో మూవీ చేయడానికి సిద్దమైన మహేష్..లేటెస్ట్ లుక్స్ ఆ సినిమా కోసమేనా?

మహేష్ బాబు మేక్ ఓవర్ ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. గుబురు గెడ్డం, పొడవాటి జుట్టుతో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా రాజమౌళి తయారు చేసాడు. అంతే కాదు ఈ సినిమాలో ఆయన మాట్లాడే భాష, యాస కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. గత రెండు మూడు నెలల నుండి అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో కూడా ఆయన పాల్గొంటున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 29, 2024 / 05:33 PM IST

    Will Rajamouli's Mahesh Babu movie come in two parts? What is Rajamouli's real planning?

    Follow us on

    Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి తో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ లాక్ అవ్వడంతో, రాజమౌళి లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడు. రీసెంట్ గానే అమెజాన్ అడవుల్లో పర్యటించడం వంటివి కూడా మనం చూసాము. షూటింగ్ జనవరి నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు మేక్ ఓవర్ ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. గుబురు గెడ్డం, పొడవాటి జుట్టుతో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా రాజమౌళి తయారు చేసాడు. అంతే కాదు ఈ సినిమాలో ఆయన మాట్లాడే భాష, యాస కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. గత రెండు మూడు నెలల నుండి అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో కూడా ఆయన పాల్గొంటున్నాడు.

    అయితే ఈ సినిమా మొదలయ్యే లోపే మహేష్ వెండితెర పై మరోసారి కనిపించే అవకాశం ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ అభిమానుల్లో జోష్ ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో గా ‘దేవకీ నందన వాసుదేవ’ అనే చిత్రం తెరకెక్కుతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి మహేష్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్న అతిథి పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియా లో ఒక ప్రచారం మొదలైంది. దీనికి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే, మూడేళ్లు తమ అభిమాన హీరోని మర్చిపోవాల్సిందే. ఒక్కొక్కసారి నాలుగేళ్ల సమయం కూడా పట్టొచ్చు. మహేష్ బాబు అభిమానులు అప్పటి వరకు ఇతర హీరోల సినిమాలు విడుదల అవుతుంటే చూస్తూ ఉండాలా?, మన హీరోని వెండితెర మీద మూడేళ్ళ పాటు చూడలేము అనే నిరుత్సాహం తో ఉండేవారు.

    కానీ ఎప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది, అప్పటి నుండి అభిమానుల్లో మహేష్ ని వెండితెర మీద చూసే అవకాశం కలుగుతుందని ఆనందించారు. కానీ మూవీ టీం నుండి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మహేష్ బాబు ఈ రూమర్ గురించి తెలుసుకొని అసహనం వ్యక్తం చేసినట్టుగా సోషల్ మీడియా లో మరో రూమర్ ప్రచారం అవుతుంది. వీటిల్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది ప్రస్తుతానికి తెలుసుకోవడం కష్టమే కానీ, ఇలా జరిగితే బాగుండును అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా అశోక్ గల్లా కి ఇది రెండవ చిత్రం. మొదటి సినిమా ‘హీరో’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ అశోక్ గల్లా నటన, డ్యాన్స్, ఫైట్స్ బాగున్నాయని ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.