Homeక్రీడలుక్రికెట్‌Rajasthan vs Chennai: రాజస్థాన్ ది అడ్డి మారి గుడ్డి గెలుపు కాదు.. పక్కా ప్లానింగ్.....

Rajasthan vs Chennai: రాజస్థాన్ ది అడ్డి మారి గుడ్డి గెలుపు కాదు.. పక్కా ప్లానింగ్.. అంతకుమించిన విజన్..

Rajasthan vs Chennai: ఐపీఎల్ లో ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్లలో పూర్తిగా బ్యాటర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. చేజింగ్ చేసిన జట్టు గెలిచింది. అయితే మూడో మ్యాచ్లో కూడా ఇదే సూత్రం పునరావృతమైంది. అయితే ఈసారి భారీ స్కోర్ నమోదు కాలేదు. భారీగా పరుగులు చేసే ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. బౌలర్ల ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. ఫలితంగా బౌలింగ్ పారడైజ్ లో.. రాజస్థాన్ జట్టు అన్ని లెక్కల మార్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఐపిఎల్ అంటే కేవలం పరుగుల వరద మాత్రమే కాదని.. పర్ఫెక్ట్ ప్లానింగ్.. అంతకు మించిన విజన్ ఉంటే కచ్చితంగా గెలవచ్చని చూపించింది.

గౌహతిలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 47 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ముందుగా బౌలింగ్ చేసి చెన్నై జట్టు టాప్ ఆర్డర్ మొత్తాన్ని పేక మేడ మాదిరిగా కూల్చేసింది. సంజు శాంసన్ నుంచి మొదలుపెడితే శివం దుబే లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా రాజస్థాన్ బౌలింగ్ చేసింది. ఆర్చర్.. రవీంద్ర జడేజా.. బర్గర్ చెన్నై జట్టు పని పట్టారు. ఒకరిని మించి ఒకరు బంతులు వేసి చెన్నై జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. గైక్వాడ్, ఆయుష్ మాత్రే, షార్ట్, వంటి బ్యాటర్లు కూడా తలవంచారంటే రాజస్థాన్ బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

గత ఏడాది దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది రాజస్థాన్. ఇక ఈసారి సీజన్లో ఆ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సోమవారం నాటి మ్యాచ్లో చెన్నై జట్టు ఫేవరెట్ గా ఉంది. చాలామంది విశ్లేషకులు కూడా చెన్నై జట్టు గెలుస్తుందని పేర్కొన్నారు. గూగుల్ ప్రీ డిక్షన్ కూడా అదే చెప్పింది. ఇన్ని చెన్నై జట్టుకు అనుకూలంగా చెప్పినప్పటికీ.. ఫలితం మారిందంటే.. రాజస్థాన్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి మ్యాచ్లో హైదరాబాద్ 200+ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కోల్ కతా కూడా హైదరాబాద్ జట్టు దారిలోనే నడిచింది. రాజస్థాన్ జట్టు మాత్రం ట్రెండు సెంటర్ చేసింది. బౌలింగ్ ను నమ్ముకుంటే.. పకడ్బందీగా బంతులు వేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని చూపించింది.

రాజస్థాన్ జట్టు బౌలర్లు కొద్దిరోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బంతులను వేసే విధానంలో సరికొత్త వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ అనుభవాన్ని ఉపయోగించి బంతి మీద పటిష్టమైన నియంత్రణ కొనసాగిస్తున్నారు. అందువల్లే సోమవారం చెన్నై జట్టు మీద రాజస్థాన్ కు విజయం సాధ్యమైంది. చెన్నై జట్టు బ్యాటర్లకు ఆ స్థాయిలో చుక్కలు చూపించారంటే రాజస్థాన్ బౌలర్లు ఎంతటి నైపుణ్యాన్ని సాధించారో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular