Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Royals Vs Punjab Kings: మీరు మగాళ్రా బుజ్జీ.. మొత్తానికి పంజాబ్ ను కొట్టేశారు..

Rajasthan Royals Vs Punjab Kings: మీరు మగాళ్రా బుజ్జీ.. మొత్తానికి పంజాబ్ ను కొట్టేశారు..

Rajasthan Royals Vs Punjab Kings: ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ జట్టుకు ఓటమి అనేది లేదు. బలమైన జట్లను ఓడించిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఎదురు అనేది లేకుండా సాగిపోతున్న ఆ జట్టుకు తొలిసారి ఓటమిని రుచి చూపించింది రాజస్థాన్ జట్టు.

పరుగుల ప్రవాహం సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు చేజింగ్లో సరికొత్త రికార్డు సృష్టించింది..ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు జైస్వాల్, సూర్య వంశీ, జూరెల్ మీద ఆధారపడిన రాజస్థాన్ బ్యాటింగ్.. తొలిసారి మిడిల్ ఆర్డర్ సత్తా వల్ల విజయం సాధించింది. దీంతో మిడిల్ ఆర్డర్ కూడా రాజస్థాన్ జట్టుకు అత్యంత బలమైన బృందంగా ఉందని నిరూపితమైంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.. ఓపెనర్ సిమ్రాన్ సింగ్ (59) మరోసారి అదరగొట్టాడు. కూపర్ కానోలి (30), అయ్యర్ (30), స్టోయినిస్(62*) పరుగులు చేయడంతో పంజాబ్ 222 పరుగులు చేసింది..

223 లక్ష్యంతో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ప్రారంభం నుంచి దాటిగా ఆడింది. ఓపెనర్లు జైస్వాల్ (51), వైభవ్ (43) సత్తా చూపించారు. వీరిద్దరి దూకుడు వల్ల రాజస్థాన్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. జూరెల్ (16), పరాగ్ (29) అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. డోనోవన్ ఫెరీర (52*), శుభం దుబే(31*) అదరగొట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. ఫలితంగా రాజస్థాన్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఒక దశలో 151 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్ జట్టు. దీంతో పంజాబ్ విజయం సాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో ఫెరీరా అదరగొట్టాడు.. పంజాబ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 26 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుభం దుబే కూడా 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి సత్తా చూపించాడు. దీంతో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వీరిద్దరిని పంజాబ్ జట్టు ప్లేయర్లు తక్కువ అంచనా వేశారు. చివరికి మూల్యం చెల్లించుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
Oktelugu Epaper
Exit mobile version