Homeక్రీడలుButtler IPL 2023: బట్లర్.. ఇదేందయ్యా ఇదీ.. సెంచరీలు కొట్టి ఈ పని ఏంది?

Buttler IPL 2023: బట్లర్.. ఇదేందయ్యా ఇదీ.. సెంచరీలు కొట్టి ఈ పని ఏంది?

Buttler IPL 2023: రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక ఆటగాడు, ఓపెనర్ జాస్ బట్లర్ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సున్నా పరుగులకే వెనుదిరగడం ద్వారా బట్లర్ ఈ చెత్త రికార్డును నమోదు చేసుకోవాల్సి వచ్చింది. జాస్ బట్లర్ నమోదు చేసుకున్న ఆ చెత్త రికార్డు ఏమిటి..? ఎలా నమోదయిందో మీరూ చదివేయండి.

రాజస్థాన్ జట్టులో బట్లర్ అత్యంత కీలకమైన ఆటగాడు. ఓపెనరుగా వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ డాషింగ్ ఓపెనర్ ఈ ఏడాది కొంత ఇబ్బందులు పడుతున్నాడు. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్.

ఐదు సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డ్..

రాజస్థాన్ జట్టు ఓపెనర్ అయిన జాస్ బట్లర్.. ఆ జట్టుకు అనేకసార్లు గొప్ప విజయాలను అందించి పెట్టాడు. శరవేగంగా పరుగులు చేసే ఈ డాషింగ్ ఓపెనర్ ఈ సీజన్ లో మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఒకే సీజన్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా తన పేరిట రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో నాలుగు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పెట్టాడు. ఈ మ్యాచ్ తో ఈ సీజన్ లో మొత్తంగా ఐదుసార్లు డకౌట్ అయ్యాడు బట్లర్. ఇప్పటి వరకు గిబ్స్, మనీష్ పాండే, శిఖర్ ధావన్, మోర్గాన్ మాత్రమే నాలుగేసి సార్లు డకౌట్ అయ్యారు. పంజాబ్ తో మ్యాచ్ కు ముందు నాలుగు డకౌట్లతో వీరి సరసన ఉన్న బట్లర్.. ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ కావడంతో తన పేరుతో సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ ల్లో డకౌట్ అయిన బట్లర్..

ఐపీఎల్ లో ఈ ఏడాది గుజరాత్ లో జరిగిన తొలి మ్యాచ్ లో బట్లర్ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఐదు బంతులాడిన బట్లర్ సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మరోసారి రెండు బంతులు ఆడి సున్నా పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిగిలిన మ్యాచుల్లో కొంత రాణించిన బట్లర్.. చివరి మూడు మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. చివరగా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ బట్లర్ సున్నా పరుగులకే అవుట్ కావడం గమనార్హం. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు బంతులాడి ఖాతా తెరవకుండానే వినుదిరిగాడు. బెంగళూరుతో జరిగిన మరో మ్యాచ్ లోను రెండు బంతులాడి సున్నా పరుగులకు పెవిలియన్ బాట పెట్టాడు. పంజాబ్ తో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్ లో కూడా మరోసారి నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకు పెవిలియన్ చేరాడు. దీంతో ఒకే సీజన్లో 5 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

పది మ్యాచ్ లో 188 పరుగులు మాత్రమే..

ఈ సీజన్ లో బట్లర్ తన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేదు. ఇప్పటి వరకు పది మ్యాచ్ లు ఆడిన బట్లర్ 188 పరుగులు మాత్రమే చేశాడు. ఐదు మ్యాచ్ ల్లో డకౌట్ కాగా.. మిగిలిన ఐదు మ్యాచ్ ల్లో అరకొర ప్రదర్శన చేశాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే బట్లర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 59 బంతులాడి 95 పరుగులు చేశాడు. గుజరాత్ తో మ్యాచ్ లో 6 బంతులాడి 8 పరుగులు మాత్రమే చేయగా, ముంబైతో మ్యాచ్ లో 19 బంతుల్లో 18 పరుగులు చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 21 బంతులాడి 27 పరుగులు చేయగా, లక్నోతో జరిగిన మ్యాచ్ లో 41 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఓవరాల్ గా చూస్తే బట్లర్ ఐదు మ్యాచ్ ల్లో డకౌట్ కాగా ఐదు మ్యాచ్ ల్లో పరుగులు చేశాడు.

RELATED ARTICLES

Most Popular