Pawankalyan – Nagababu : మెగా బ్రదర్స్ మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో సోలోగా ఎంటరై ఎంతో కష్టపడి చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు పొందారు. భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఇంతమంది నటులు ఎంట్రీకి కారణమయ్యారు. కొణిదెల కుటుంబానికి సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చారు. మెగా బ్రదర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుంటారు. ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకుంటారు.
చిరంజీవి మెగాస్టార్ గా ఎదగగా.. పవన్ కళ్యాణ్ మెగా పపర్ స్టార్ గా, అగ్ర కథనాయకుడిగా రాణిస్తున్నారు. నాగబాబు నటుడిగా, నిర్మాతగా స్థిరపడ్డారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తో ఆ మధ్యన ఆరెంజ్ సినిమా తీశారు. కానీ అది డిజస్టర్ గా నిలిచింది. మగధీర సినిమా తరువాత రిలీజ్ అయిన ఆరెంజ్ ప్రేక్షకుల ఆలోచనలకు అందుకోలేకపోయింది. లవ్ ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో నిరాశపరచింది. నాగబాబుకు తీరని నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పవన్ కళ్యాణ్ భర్తీచేసి సోదరుడ్ని ఆదుకున్నారు.
అయితే అదే ఆరెంజ్ చిత్రాన్ని ఇటీవల రీరిలీజ్ చేశారు. ట్రెండ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సినిమాల్లో ఆరెంజ్ కూడా వుంది. ఇప్పుడీ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పారు నిర్మాత నాగబాబు. కోటి ఐదు లక్షల రూపాయిలు రాబట్టింది. ఈ మొత్తం డబ్బుని పవన్ కళ్యాణ్ జనసేనకి పార్టీ ఫండ్ గా ఇచ్చారు నాగబాబు. అప్పట్లో కష్టాల్లో ఆదుకున్న పవన్ కి అందులో కొంత మొత్తం ఇచ్చి రుణం తీర్చుకున్నారు.