Rahul Dravid: ద్రావిడ్ ఔట్…ఇండియన్ టీం కి కొత్త కోచ్…

బీసీసీఐ అతన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అతని ప్లేస్ లో మరొక కోచ్ వస్తడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇండియా కనక వన్డే వరల్డ్ కప్ కొట్టి ఉంటే రాహుల్ ద్రావిడ్ మరొకసారి కూడా హెడ్ కోచ్ గా ఇండియన్ టీమ్ కు కొనసాగే అవకాశం ఉండేది కానీ ఎన్నో అంచనాల మధ్య వచ్చి ఓడిపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు.

Written By: Gopi, Updated On : November 21, 2023 12:53 pm

Rahul Dravid

Follow us on

Rahul Dravid: ఇండియన్ టీం భారీ అంచనాలతో వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాభావాన్ని చవిచూసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం 2003 వ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయిందో ప్రస్తుతం 2023 లో కూడా అలాంటి పరిస్థితుల్లోనే మరో పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇక ఇలాంటి సందర్భంలో ఇండియన్ టీమ్ కి గత కొన్ని సంవత్సరాలుగా హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిపోయింది. ఇక దాంతో మరో టర్మ్ కూడా బీసీసీఐ అతన్ని కోచ్ గా కొనసాగిస్తుందా లేదా రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా తప్పకుంటాడా అనే వార్తలు కూడా చాలానే వస్తున్నాయి.

ఎందుకంటే బీసీసీఐ అతన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అతని ప్లేస్ లో మరొక కోచ్ వస్తడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇండియా కనక వన్డే వరల్డ్ కప్ కొట్టి ఉంటే రాహుల్ ద్రావిడ్ మరొకసారి కూడా హెడ్ కోచ్ గా ఇండియన్ టీమ్ కు కొనసాగే అవకాశం ఉండేది కానీ ఎన్నో అంచనాల మధ్య వచ్చి ఓడిపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. ఇది ఆటోమేటిక్ గా ఆ ఓటమికి కోచ్ ని కూడా కారణంగా పరిగణిస్తారు కాబట్టి ఆయన మీద కూడా బిసిసిఐ లో కొంత నెగిటివిటీ అయితే ఉంది.

ఇక దీంతో రాహుల్ ద్రావిడ్ ని కోచ్ గా కొనగించే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. ఇక మరి కొత్త కోచ్ గా ఎవరు వస్తారు అనేది తెలియాల్సి ఉంది…ఇక రాహుల్ ద్రావిడ్ మొదటినుంచి కూడా వరల్డ్ కప్ గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నాడు. కానీ ఫైనల్ లోకి వచ్చి ఆస్ట్రేలియా చేతిలో ఇలా ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత ఇప్పుడు ద్రావిడ్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్టు గా తెలుస్తుంది…

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత ప్లేయర్లని మన భారత ప్రధాని మంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు కలిసి వాళ్ళందరికీ ఎంకరేజ్ ని ఇచ్చినట్టుగా ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. ఓటమి అనేది సహజం ఎప్పుడు మనం పోరాటం చేస్తూనే ఉండాలి గెలుపు అదే వస్తుందని కొన్ని మోటివేషనల్ మాటలు మోడీ ప్లేయర్లకి చెప్పినట్టుగా తెలుస్తుంది…మరి రాహుల్ ద్రావిడ్ కనక కోచ్ గా తప్పుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ టీం కి కోచ్ గా ఎవరు వస్తారు అనేది తెలియాల్సి ఉంది…