Sunil: సునీల్ ని పట్టించుకోని తమిళ్ ఇండస్ట్రీ…కారణం ఏంటంటే..?

హీరో గా సునీల్ కి ఒకటి రెండు సక్సెస్ లో వచ్చినప్పటికీ ఆ తర్వాత సునీల్ చేసిన సినిమాలు మొత్తం వరుసగా డిజాస్టర్లు అవ్వడం తో హీరోగా ఆయన కెరియర్ అనేది పడిపోయింది. ఇక అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ సునీల్ మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ఎదురు చూశాడు.

Written By: Gopi, Updated On : November 21, 2023 1:00 pm

Sunil

Follow us on

Sunil: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ కమెడియన్ గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు సునీల్… అప్పట్లో సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అందులో 190 సినిమాల్లో సునీల్ ఉండేవాడు.అలా ఆయన కెరియర్ కమెడియన్ గా అప్పట్లో పిక్ స్టేజ్ లో ఉండేది.ఇక ఆయన అప్పట్లో షూటింగ్స్ లో ఉన్న బిజీ వల్ల కొన్నిసార్లు తినడానికి కూడా టైం ఉండేది కాదట అలాంటి ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో మర్యాద రామన్న అనే సినిమా చేశాడు.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇక దాంతో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే హీరో గా సునీల్ కి ఒకటి రెండు సక్సెస్ లో వచ్చినప్పటికీ ఆ తర్వాత సునీల్ చేసిన సినిమాలు మొత్తం వరుసగా డిజాస్టర్లు అవ్వడం తో హీరోగా ఆయన కెరియర్ అనేది పడిపోయింది. ఇక అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ సునీల్ మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకి తన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ లో ఒక్క క్యారెక్టర్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా లో చేసినందుకుగాను అతనికి పెద్దగా గుర్తింపు అయితే ఏమీ రాలేదు. కానీ అల్లు అర్జున్ హీరో గా వచ్చిన పుష్ప సినిమాలో ఆయన చేసిన మంగళం శీను క్యారెక్టర్ కి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ఆయన వరసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక పాపులారిటి ని సంపాదించుకుంటున్నాడు…

ఇక అప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సునీల్ ఇప్పటికీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటిస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. ఇక రీసెంట్ గా కార్తీ హీరోగా వచ్చిన జపాన్ సినిమాలో కూడా సునీల్ నటించాడు అయితే ఈ సినిమా బాక్సా వద్ద ఫ్లాప్ అయింది…ఇక దాంతో ఇప్పుడు తమిళం లో సునీల్ ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందే సునీల్ కమిట్ అయిన కొన్ని సినిమాల నుంచి సునీల్ ని తప్పించినట్టుగా తెలుస్తుంది.

ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడానికి ఆయనకి అవకాశాలు రాకపోవడానికి సంబంధం ఏంటి అనేది ఏమి తెలియనప్పటికీ తెలుస్తున్న విషయం ప్రకారం తమిళ్ ఇండస్ట్రీ పెద్దలు మనవాళ్లను పెట్టుకుని సినిమాలు చేయండి బయట వాళ్ళకి అవకాశాలు తగ్గించండి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సునీల్ ని తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అనే టాక్ అయితే వస్తుంది…