S.C. Classification : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ వర్గీకరణ నిర్ణయం.. రెండు తెలుగు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపేస్తోంది. తెరమరుగైన అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం రెండు పనులు చేసింది. ఎస్సీ రిజర్వేషన్ ను 15 నుంచి 17శాతానికి పెంచాడు. ఎస్టీలకు 3 నుంచి 7 శాతం పెంచాడు. రెండో నిర్ణయంగా 17శాతం ఎస్సీ రిజర్వేషన్ను నాలుగు భాగాలుగా నిర్ణయించారు. కేటగిరి1గా మాదిగలకు 6శాతం, ఐదున్నర శాతాన్ని మాల సామాజికవర్గానికి, బంజారాలు నాలుగున్నర శాతం.. మిగతా ఎస్సీ కమ్యూనిటీలకు 1శాతం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఎస్సీ వర్గీకరణపై మందక్రిష్ణ మాదిగ అనాదిగా పోరాడుతున్నారు. జనాభాకు అనుకూలంగా ఉద్యోగాల్లేవు. ఎక్కువమంది ఒకవర్గం వారే ఉద్యోగాలు పొందుతున్నారు. సుప్రీంకోర్టు ఈ ఏపీ ఎస్సీ వర్గీకరణను కొట్టేసింది.
– రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టారు.
తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉండగా.. ఏపీలో మాలలు ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో మాల సామాజికవర్గాలే అత్యధిక ఉద్యోగాలు పొందారు. మాదిగలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన ఆ వర్గాల్లో ఉంది.
కర్ణాటక ప్రభుత్వం S.C. వర్గీకరణ నిర్ణయం ఆంధ్రా, తెలంగాణల్లో ప్రకంపనలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.