Homeక్రీడలుక్రికెట్‌Rahane Kolkata controversy: కోల్ కతా లో చిచ్చు పెట్టిన రహానే.. షారుక్ ఖాన్ ఇది...

Rahane Kolkata controversy: కోల్ కతా లో చిచ్చు పెట్టిన రహానే.. షారుక్ ఖాన్ ఇది ఊహించలేదుగా

Rahane Kolkata controversy: ఐపీఎల్ లో 1.5 కోట్ల కెప్టెన్ గా పేరుపొందిన రహానే కోల్ కతా జట్టులో చిచ్చు రేపాడు. అతడి నాయకత్వంలో కోల్ కతా జట్టు ఆదివారం ముంబై తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. 220 పరుగులు చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని కోల్ కతా జట్టు కాపాడుకోలేకపోయింది. దీంతో కోల్ కతా జట్టు బౌలర్ల పై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో జట్టు వైఫల్యం తర్వాత కోల్ కతా సారధి రహానే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. జట్టు వైఫల్యం గురించి వివరించాడు. ఈ క్రమంలో విలేకరులు గ్రీన్ తో బౌలింగ్ ఎందుకు చేయించలేదని అతడిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రహానే కీలక వ్యాఖ్యలను చేశాడు. అవి కాస్త అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి..

గ్రీన్ తో ఎందుకు బౌలింగ్ చేయించలేదు అనే ప్రశ్నకు.. రహానే తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు సమాధానం మీరు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ బోర్డును అడగాలని రహనే సమాధానంగా చెప్పాడు. ఇంత విలేకరులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రహానే చెప్పిన ఆ సమాధానం ఏకంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ దాకా వెళ్ళింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధులు స్పందించక తప్పలేదు.

“గ్రీన్ గాయం పాలయ్యాడు. వైద్యుల సూచనల మేరకు అతడు కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బౌలింగ్ ఇవ్వలేదు. అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించిన తర్వాత బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడని” ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.

మైదానంలో నిదానంగా.. సానుకూలంగా ఉండే రహనే.. ఒక్కసారిగా తన శైలికి భిన్నంగా సమాధానం చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టు ఓటమికి అనేక కారణాలను విశ్లేషించిన అతడు.. షారుక్ ఖాన్ ఎంతో ముచ్చటపడి భారీ ధరకు కొనుక్కున్న గ్రీన్ పై పరోక్షంగా విమర్శలు చేశాడు. దీంతో షారుక్ ఖాన్ కు షాక్ ఇచ్చాడని రహనేపై విమర్శలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ముంబై జట్టుపై ఓటమికి అసలు కారణాలు చెప్పకుండా.. రహానే ఇలా డైవర్ట్ చేయడం పట్ల కొంతమంది క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. రహానే అలా అని ఉండకూడదని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version