https://oktelugu.com/

మెగా హీరో సినిమా నుండి ఆమెను తప్పించడానికి కారణం అదేనట

ఒక్కోసారి అందివచ్చిన అవకాశాలు కూడ చేజారిపోతుంటాయి. ఇంకోసారి మనది కాదు అనుకున్న ఆఫర్ కోడ్ వెతుక్కుంటూ వస్తుంది. వీటిలో రెండోది జరిగితే సమస్య ఉండదు కనే మొదటి జరిగితేనే ఇబ్బంది. ఒక సినిమా గురించి డిస్కషన్ జరిగి తీరా ఇంకొద్ది రోజుల్లో సెట్స్ మీదకి వెళుతుంది అనుకునేలోపు ఆమెను కాకుండా వేరొక నటిని తీసుకుంటే ఎలా ఉంటుంది. కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఇదే జరిగింది కథానాయిక నివేత పేతురాజ్ విషయంలో. మెగా హీరో సాయి తేజ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 2, 2020 / 06:36 PM IST
    Follow us on


    ఒక్కోసారి అందివచ్చిన అవకాశాలు కూడ చేజారిపోతుంటాయి. ఇంకోసారి మనది కాదు అనుకున్న ఆఫర్ కోడ్ వెతుక్కుంటూ వస్తుంది. వీటిలో రెండోది జరిగితే సమస్య ఉండదు కనే మొదటి జరిగితేనే ఇబ్బంది. ఒక సినిమా గురించి డిస్కషన్ జరిగి తీరా ఇంకొద్ది రోజుల్లో సెట్స్ మీదకి వెళుతుంది అనుకునేలోపు ఆమెను కాకుండా వేరొక నటిని తీసుకుంటే ఎలా ఉంటుంది. కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఇదే జరిగింది కథానాయిక నివేత పేతురాజ్ విషయంలో. మెగా హీరో సాయి తేజ్ కొత్తగా మొదలుపెట్టిన చిత్రంలో ముందుగా ఈమెనే హీరోయిన్ అనుకున్నారు.

    Also Read: మహేష్ హీరోయిన్ కు మగబిడ్డ పుట్టాడు

    కానీ ఏమైందో ఏమో కానీ షూటింగ్ మొదలయ్యే నాటికి అన్నే మారిపోయి ఆమె స్థానంలోకి మరొక నటి ఐశ్వర్య రాజేష్ వచ్చి చేరింది. దీంతో అందరిలోనూ ఏం జరిగి ఉంటుంది అనే ఉత్కంఠ. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు మొదటగా దర్శకుడు దేవ కట్ట తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ మంచి నటి. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. దేవ కట్ట కూడ గ్లామర్ కంటే నటనకే ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అందుకే ఆయన ఐశ్వర్యను తీసుకుందాం అనుకున్నారు.

    Also Read: మెగా క్యాంపులో ఇరుక్కుపోయిన కొరటాల?

    కానీ ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్లు కుదర్లేదు. దీంతో చేసేది లేక నివేత పేతురాజ్ పేరును కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యే నాటికి ఐశ్వర్య డేట్స్ ఫ్రీ అయ్యాయని కబురందిందట. దీంతో నివేత పేరును తీసేసి ఐశ్వర్యను తీసుకున్నారట. ఆలా నివేత మంచి సినిమా అవకాశాన్ని తృటిలో కోల్పోయిందన్నమాట. నివేత పేతురాజ్ కూడ టాలెంట్ ఉన్న హీరోయినే. ‘మెంటల్ మదిలో’ సినిమాతో పరిచయమైనా ఆమె ‘చిత్రలహరి, బ్రిచేవారెవరురా’ చిత్రాలతో మెప్పించింది. ఆమెకు కూడ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్