spot_img
Homeక్రీడలుక్రికెట్‌Punjab match win analysis: పంజాబ్ గెలిచింది గాని.. ఈ ఎక్స్ ట్రా బౌలర్ ఉంటే.....

Punjab match win analysis: పంజాబ్ గెలిచింది గాని.. ఈ ఎక్స్ ట్రా బౌలర్ ఉంటే.. ఆశలు వదిలేసుకోవాల్సిందే

Punjab match win analysis: ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తొలి మ్యాచ్ గెలిచింది. ఒక మోస్తరు స్కోర్ టార్గెట్ మొత్తాన్ని చివరి వరకు పోరాడి సాధించింది. విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు ఆ స్కోరును కాపాడుకోవడానికి గుజరాత్ బౌలర్లు చివరి వరకు పోరాడడం నిజంగా అభినందనీయం.

ఐపీఎల్ లో పరుగుల వరద పారుతూ.. 200+ పరుగుల లక్ష్యం కూడా సులభంగా చేదిస్తున్నారు ఆటగాళ్లు. అటువంటి చోట 161 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు ప్రారంభం నుంచి చివరి వరకు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. వీరిద్దరు కూడా అత్యంత పదునైన బంతులు వేశారు. వికెట్లు తీయడం మాత్రమే కాదు.. పరుగులు ఇచ్చే విషయంలో కూడా అత్యంత పిసినారి పాత్ర పోషించారు.

బౌలింగ్ పరంగా గుజరాత్ జట్టుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ జట్టు బౌలర్లలో చాహల్, యాన్సన్ కట్టుదిట్టంగా బంతులు వేశారు. చాహల్ నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. యాన్సన్ 4 ఓవర్లు వేసి.. కేవలం ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు.. కానీ అర్ష్ దీప్ సింగ్ అత్యంత దారుణంగా బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లు వేసి.. ఒక్క వికెట్ కూడా తీయకుండా 42 పరుగులు ఇచ్చాడు..

Also Read: గుజరాత్ ఓడిపోయినా.. ఈ మూడు ఓవర్లు ఐపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా..

ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో ఒక ఓవర్లో ఏకంగా 11 ఎక్స్ ట్రా లు ఇచ్చాడు అర్ష్ దీప్ సింగ్. తాజాగా గుజరాత్ లో జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్లో ఆరు ఎక్స్ ట్రా లు ఇచ్చాడు. ఆ ఓవర్ లో మొత్తం 11 పరుగులు ఇచ్చాడు. అతడు వేసిన అదనపు బంతుల వల్ల ఐపిఎల్ లో సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్ల జాబితాలో నిలిచాడు. ఈ లిస్టులో సిరాజ్, తుషార్, శార్దుల్, సందీప్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

అర్ష్ దీప్ సింగ్ కు పంజాబ్ మైదానాలు కొట్టినపిండి. అతడు తన కెరియర్ మొత్తాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టాడు. అయితే సొంత మైదానంలో కూడా అతడు తేలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంతిమీద నియంత్రణ కోల్పోయి.. అదనపు పరుగులు ఇవ్వడం అతడి బేలతనాన్ని నిరూపిస్తోంది. అతడు తన బౌలింగ్ మొత్తాన్ని ఇలానే కొనసాగిస్తే పంజాబ్ జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version