Punjab & Haryana Farmers : పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శుక్రవారం(డిసెంబర 6న) దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతోపాటు డిమాండ్లు నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులోని శంభుకు చేరుకున్నారు. తాజాగా శంభు, ఖనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఖనౌరి పాయింట్ వద్ద ఉన్న రైతులను ఢిల్లీకి అనుమతించే తేదీ ఇంకా నిర్ణయించలేదు. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యాన ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించింది. అదనంగా మూడంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించారు.
101 మందితో పాదయాత్ర..
రైతు నాయకుడు కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శర్వణ్‌సింగ్ పాంథేర్ మాట్లాడుతూ రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన ఢిల్లీకి వెళ్తారన్నారుజ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో పాదయాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీకి మార్చ్ సాగుతుందని తెలిపారు.
వ్యాపారుల మద్దతు..
ఇదిలా ఉంటే.. రైతుల ఉద్యమానికి ఖాప్ పంచాయతీలు, వ్యాపారులు మద్దతు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రంలో నాలుగు రౌండ్ల చర్చలు జరిపామని, కానీ ఫిబ్రవరి 18 నుంచి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసమే ఈ యాత్ర చేసైఉ్తన్నామన్నారు. పాదయాత్రను అడ్డుకుంటే.. అది తమ నైతిక విజయమన్నారు.