IPL 2024: దూకుడుకు మారుపేరన్నారు. ఎగబడి సిక్స్ లు కొడతాడని చెప్పారు. నిలబడి ఫోర్లు బాదేస్తాడన్నారు. ఆపద సమయంలో ఆదుకుంటాడని.. కష్టకాలంలో అండగా ఉంటాడని.. గొప్పగా చెప్పారు. కానీ ఏం జరుగుతోంది.. పట్టుమని పది నిమిషాలు క్రీజ్ లో ఉండలేకపోతున్నాడు. పేలవమైన షాట్స్ ఆడి దొరికిపోతున్నాడు. నిరాశగా మైదానం వీడి వెళ్లిపోతున్నాడు. అలాగని అతడేం ఆ నామక బ్యాటర్ కాదు. కోటికో రెండు కోట్లకో కొన్న ఆటగాడు అంతకన్నా కాదు.. అతడికి చెల్లించింది అక్షరాల ఆరు కోట్లు.. కానీ మైదానంలో అతడు చూపిస్తున్న ప్రతిభ అక్షరాల జీరో..
పంజాబ్ జట్టు ఇంగ్లాండ్ దేశానికి చెందిన జానీ బెయిర్ స్టో ను 6 కోట్లకు కొనుగోలు చేసింది. అతనిపై ఎన్నో అంచనాలు పెంచుకుంది. ఇంగ్లాండ్ దేశం తరఫున ఆడినట్టే.. తమ జట్టు తరుపున కూడా ఆడతాడని భావించి ఏకంగా ఓపెనర్ గా అవకాశం కల్పించింది. కానీ అతడు దారుణమైన ఆట తీరుతో జట్టును ఇబ్బంది పడుతున్నాడు. సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన చోట 8, 9 పరుగులకే అవుట్ అవుతున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్లపై ఆ బ్యాటింగ్ భారం పడుతోంది. ఢిల్లీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో జానీ బెయిర్ స్టో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈశాంత్ శర్మ బౌలింగ్ లో అనవసరంగా రన్ అవుట్ అయ్యాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లోనూ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రెండు ఫోర్లు కొట్టి సౌకర్యవంతంగా కనిపించిన జానీ బెయిర్ స్టో ఆ తదుపరి బంతికి అనవసర షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. వాస్తవానికి ఐపీఎల్ వేలంలో జానీ బెయిర్ స్టో ట్రాక్ రికార్డు గమనించిన పంజాబ్ జట్టు ఎగిరి గంతేసి మరీ కొనుగోలు చేసింది. జట్టుకు ఉపయోగపడతాడని భావించింది.. తురుపు ముక్క లాగా పనికొస్తాడని అంచనా వేసింది. కానీ జరుగుతోంది వేరు..
వాస్తవానికి ఐపీఎల్ అంటేనే దూకుడుకు సిసలైన పేరు. పైగా ఓపెనర్లకు విపరీతమైన బాధ్యత ఉంటుంది. వారు ఆడిన ఇన్నింగ్స్ ప్రకారమే జట్టు గెలుపు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఓపెనర్ విఫలమైతే.. మిగతా బ్యాటర్లపై ఆ ప్రభావం ఉంటుంది. ఒకవేళ వారు కూడా అవుట్ అయితే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. శిఖర్ ధావన్ లాగా ఆడితే పంజాబ్ జట్టు తొలి, మలీ మ్యాచ్ లలో దాదాపు 200 పరుగుల వరకు స్కోర్ సాధించేది. అయితే జానీ బెయిర్ స్టో ఆ స్థాయిలో ఆడకపోవడంతో పంజాబ్ జట్టు ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో 177, బెంగళూరు తో జరిగిన రెండో మ్యాచ్లో 176 పరుగులు మాత్రమే చేసింది.
జానీ బెయిర్ స్టో ఆట తీరు పట్ల పంజాబ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జట్ల ఓపెనర్లను చూసి
జానీ బెయిర్ స్టో నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఆరు కోట్ల ఆటగాడు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆట తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. “ఓపెనర్ అంటే దూకుడుగా ఆడాలి. ఇంకా ఆ దూకుడు జానీ బెయిర్ స్టో కు వంటబట్టినట్టు లేదు. లీగ్ మ్యాచ్ అని లైట్ తీసుకుంటే.. అదే పెద్ద ప్రమాదకరంగా మారుతుందని” అభిమానులు జానీ బెయిర్ స్టో ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.. మరి వచ్చే మ్యాచ్ కైనా అతడు తన ఆట తీరు మార్చుకుంటాడని పంజాబ్ అభిమానులు ఆశిస్తున్నారు.
An UNFORTUNATE RUNOUT OF#JOHNNYBAIRSTOW#IPL2024 #PakistanDay pic.twitter.com/Mnbg7Hz7DB
— mortasim (@mortasim_x) March 23, 2024
Johnny Bairstow gone cheaply! #RCBvsPBKS #IPL2024 pic.twitter.com/XmDtxIV7UL
— Aqdas Rehman (@AqdasRehman) March 25, 2024