https://oktelugu.com/

Kylian Mbappe: ఫుట్ బాల్ ప్లేయర్ ఎంబాపెకు 2719 కోట్లు.. వామ్మో అంత మొత్తమా..! ఎందుకు ఇంత ఖరీదు?

ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కీలక ఆటగాడిగా ఎదిగాడు. 24 ఏళ్ల వయసు ఉన్న ఎంబాపె ఇప్పటి వరకు 66 మ్యాచుల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సామర్థ్యం ఈ ఆటగాడి సొంతం. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫ్రాన్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు.

Written By:
  • BS
  • , Updated On : July 25, 2023 3:57 pm
    Kylian Mbappe

    Kylian Mbappe

    Follow us on

    Kylian Mbappe: ప్రపంచ ఫుట్ బాల్ క్రీడలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు కిలియన్ ఎంబాపె. ప్రాన్స్ కు చెందిన కిలియన్ ఎంబాపె అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. అందుకే అభిమానులకే కాదు.. ప్రాంచైజీ యజమానులు కూడా ఎంబాపే అంటే గురి ఎక్కువ. ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు అనేక ప్రాంచైజీలు కూడా భారీ మొత్తంలో చెల్లించేందుకు సిద్ధమవుతుంటాయి. ఈ క్రమంలోనే క్లబ్ ఫుట్ బాల్ లో పారిస్ సెయింట్ జర్మయిన్స్ (పిఎస్జి) ఆడుతూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. గతేడాది జరిగిన ప్రపంచ కప్ లో జట్టును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ఈ ఫ్రాన్స్ ఆటగాడు టోర్నీలో అత్యధికంగా ఎనిమిది గోల్స్ సాధించాడు. అయితే, పారిస్ సెయింట్ జర్మయిన్స్ (పిఎస్జి) ఎంబాపె చేసుకున్న ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ క్రమంలోనే అతడిని దక్కించుకునేందుకు పలు ప్రాంచైజీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.

    ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కీలక ఆటగాడిగా ఎదిగాడు. 24 ఏళ్ల వయసు ఉన్న ఎంబాపె ఇప్పటి వరకు 66 మ్యాచుల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సామర్థ్యం ఈ ఆటగాడి సొంతం. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫ్రాన్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించి ఫ్రాన్స్ జట్టు విజయం సాధించేందుకు అనుగుణంగా పోటీలో నిలిపాడు. అయితే, చివరి నిమిషంలో ఫ్రాన్స్ ఓడిపోయింది. ఇకపోతే 2018 లోనూ ఫ్రాన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకంగా వ్యవహరించాడు. అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతుండడంతో లీగ్ ల్లో తమ జట్టు తరఫున ఆడించేందుకు అనేక ప్రాంచైజీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయలు చెల్లించి ఎంబాపెను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు సిద్ధపడుతున్నాయి.

    రికార్డ్ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న సౌదీ అరేబియా క్లబ్..

    క్లబ్ ఫుట్ బాల్ లో పారిస్ సెయింట్ జర్మయిన్స్ (పిఎస్జి) లో కీలక ఆటగాడిగా ఉన్న ఎంబాపె వచ్చే ఏడాది నుంచి ఆ క్లబ్ ను వదలాలని భావిస్తున్నాడు. కానీ, పిఎస్జి మాత్రం ఒప్పందాన్ని పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒప్పందం పొడిగించడం సాధ్యం కాకపోతే ఖాళీగా వదిలేయడం కంటే అత్యధిక ధరకు వేరే క్లబ్ కు అమ్మేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎంబాపె లాంటి ఆటగాడిని సొంతం చేసుకునేందుకు పలు జట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాకు చెందిన ఆల్ హిలాల్ క్లబ్ ఎంబాపె కోసం ఏకంగా ప్రపంచ రికార్డు మొత్తం రూ.2,719 కోట్లు (259 మిలియన్ ఫౌండ్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్న పిఎస్జి.. ఎంబాపెతో మాట్లాడేందుకు ఆ క్లబ్ కు అనుమతి ఇచ్చింది. అయితే, సౌదీ లీగ్ లో ఆడేందుకు ఎంబాపె ఆసక్తిగా లేడని తెలుస్తోంది. ఎంబాపె ఈ ఒప్పందానికి అంగీకరిస్తే మాత్రం ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక మొత్తాన్ని తీసుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడని పలువురు పేర్కొంటున్నారు.