Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్, అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ లో సెగలు పుట్టిస్తోంది. తాజాగా డ్రగ్స్ వాడకం విషయంలో ఈ భామ చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తోంది.
బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉందని, ఇక్కడ ఉండే ప్రతి సెలెబ్రిటీ కూడా డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్లు అని, ఒక స్టార్ హీరోకి కూడా విపరీతమైన డ్రగ్స్ అలవాటు ఉంది, అందుకే వాళ్ళ ఆవిడ అతనిని వదిలేసిందని, ఆ తర్వాత నేను కొన్ని రోజులు అతనితో డేటింగ్ చేశానని ఆ సమయంలో కూడా అతను డ్రగ్స్ ఎక్కువగా తీసుకునేవాడని, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను బెదిరించడంతో నేను అతనికి దూరం కావల్సి వచ్చిందని ఓపెన్ కామెంట్స్ చేసింది.
ఇలాంటి విషయాలు బాలీవుడ్ లో ఎవరు కూడా ధైర్యంగా బయటకు చెప్పరని, కానీ నాకు అలాంటి భయాలు ఏమి లేవు కాబట్టి నేను ధైర్యంగా చెపుతున్న అంటూ అంటూ తెలిపింది. అయితే ఆమె స్టార్ హీరో హృతిక్ రోషన్ ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. హృతిక్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కంగనా తో కొన్ని రోజులు డేటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం గా ఉండటమే కాకుండా ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకున్నారు.
ఈ సమస్యను సద్దుమణిగేలా చేయడానికి బాలీవుడ్ కు చెందిన పెద్ద పెద్ద తలకాయలు ముందుకు వచ్చిన కానీ కంగనా తగ్గలేదు. ఆ తర్వాత కొంచెం సర్దుమణిగిన కానీ సమయం దొరికిన ప్రతిసారి హృతిక్ ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా దేశంలోని కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా గతంలో చేసింది కంగనా, దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ సెక్యూరిటీ కల్పించటం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చంద్రముఖి 2 లో రాజనర్తకి పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.