Rohit-Yashasvi : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 5 t20 మ్యాచ్ ల సిరీస్ కు యశస్వి జైస్వాల్ కు జట్టులో చోటు లభించలేదు. దీంతో జైస్వాల్, రోహిత్ రంజిలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ కఠినమైన నిబంధనలను విధించడంతో.. రోహిత్, జైస్వాల్ రంజీలో ముంబై జట్టు తరఫున రంగంలోకి దిగుతున్నారు. జనవరి 23 నుంచి జమ్మూ కాశ్మీర్ జట్టుతో ముంబై రంజీ మ్యాచ్ ఆడుతుంది. వీరిద్దరు కూడా అజింక్య రహనే సారథ్యంలో ఆడతారు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ రంజి జట్టును సోమవారం సాయంత్రం ప్రకటించింది..
అతడు అవుట్
రోహిత్, జైస్వాల్ జట్టులోకి రావడంతో పృథ్వీ షా తన స్థానాన్ని కోల్పోయాడు. శరీరంపై పట్టు లేకపోవడం.. సామర్ధ్య సమస్యలు.. దారుణమైన ఫామ్ తో అతడు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడిని సెలెక్టర్లు లెక్కలోకి తీసుకోలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత రోహిత్ రంజీ ఆడుతున్నాడు. 2015లో చివరిసారిగా రోహిత్ శర్మ రంజి క్రికెట్ ఆడాడు. అయితే ఇటీవల కాలంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా ఆడాడు.. మూడు మ్యాచ్ లలో ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన అతను కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. రోహిత్ మాత్రమే కాకుండా మిగతా ఆటగాళ్లు కూడా సరిగ్గా ఆడలేక పోతున్న నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిబంధనలు తెరపైకి తీసుకువచ్చింది. క్రికెటర్లు మొత్తం క్రికెట్ ఆడాలని ప్రకటించింది.. అయితే విపరీతమైన షెడ్యూల్ వల్లనే తాము దేశవాళీ క్రికెట్ ఆడలేకపోతున్నామని రోహిత్ శర్మ ఇటీవల తనకు ఓ విలేఖరి నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానం గా చెప్పాడు..” మేం కూడా మనుషులమే. యంత్రాలం అంతకన్నా కాదు. విపరీతమైన షెడ్యూల్ ఉండడం వల్ల రంజి క్రికెట్ ఆడలేకపోతున్నాం. మా కూడా కాస్త రిఫ్రెష్ అవ్వడానికి సమయం కావాలి. ఆటపై ఫోకస్ చేయడానికి బ్రేక్ కావాలి. 2019 నుంచి నేను నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నాను. బిజీబిజీ షెడ్యూల్ వల్ల కొన్నిసార్లు తప్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం టైముంది.. అందువల్లే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని నిబంధన తీసుకొచ్చారని” రోహిత్ వ్యాఖ్యానించాడు.
ముంబై రంజి జట్టు ఇదే
రహనే (కెప్టెన్), జైస్వాల్, ఆయుష్, రోహిత్, శ్రేయస్ అయ్యర్, సిద్దేశ్, దుబాయ్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, తనుష్ కోటియన్, హిమాన్షు, శామ్స్ ములాని, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, రోస్టన్ డిఎస్, కర్ష్, సిల్వెసర్ డిసౌజ.