Preity Zinta : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో 111 పరుగులకు పంజాబ్ జట్టు ఆల్ అవుట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో.. ప్రీతిజింటా అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు అవి. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు భారీగా స్కోర్ చేసినప్పటికీ.. దానిని నిలుపు కోలేకపోయింది. బౌలింగ్ లో చేతులెత్తేసింది. ఫీల్డింగ్ లో తలవంచింది. మొత్తంగా దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. అంతేకాదు హైదరాబాద్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమి ఒక రకంగా పంజాబ్ జట్టుకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ఇక ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో గనుక ఓడిపోతే.. మరింత కిందికి పంజాబ్ జట్టు దిగజారుతుంది. అదే గనుక జరిగితే అయ్యర్ నాయకత్వంలోనూ ఫ్లాప్ స్టోరీ కంటిన్యూ అవుతుంది.
Also Read : శ్రేయస్ అయ్యర్ పై మెత్తపడ్డ బిసిసిఐ.. సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కినట్టేనా..
పాపం ప్రీతి జింటా
పంజాబ్ ఓపెనర్లు కొద్దిసేపు ధాటిగా ఆడారు. ఆ సమయంలో ప్రీతి కాస్త ఆనందం వ్యక్తం చేసింది. ఎప్పుడైతే ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వెంట వెంటనే అవుట్ అయ్యారో.. అదిగో అప్పుడే ప్రీతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో.. ఆమె బాధలో కూరుకుపోయింది.. ఆటగాళ్లు దారుణమైన ప్రదర్శన చూపిస్తున్న నేపథ్యంలో.. ప్రీతి కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి. వీడియో గ్రాఫర్ పదేపదే ప్రీతిని చూపించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ దేశంలో పంజాబ్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ” కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. ఇలాంటి ఆటా ఆడేది. ప్రీతి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అసలు ఆమెను ఎందుకు ఏడిపిస్తున్నారు.. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయారు. ఇప్పుడేమో ఇలా ఆడుతున్నారంటూ” సోషల్ మీడియాలో ప్రీతి అభిమానులు పేర్కొంటున్నారు.
దారుణంగా విఫలమయ్యారు
గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ను మెగా వేలంలో పంజాబ్ జట్టు యాజమాన్యం రికార్డు దారకు కొనుగోలు చేసింది. కానీ అతడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. 0 పరుగులకే వెను తిరిగి వచ్చాడు. ఒకరకంగా అతడి అవుట్ ప్రీతిజింటాను నివ్వెర పరిచింది.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 80 కి పైగా పరుగులు చేసిన అతడు.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో సున్నా పరుగులు చేయడాన్ని ప్రీతి జింటా జీర్ణించుకోలేకపోయింది. అసలు అలా ఎలా జరిగింది అన్నట్టుగా తన హావభావాలు ప్రదర్శించింది.
Preity Zinta in the stands. pic.twitter.com/DX0Ar2dr6C
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025