IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు అవేనా.. ఆర్సీబీ ఇంటికేనా?

గుజరాత్, లక్నో జట్లు ప్లే ఆఫ్ కు చేరేంత సత్తా ఉన్నప్పటికీ.. అవి ఇటీవల మ్యాచులలో సమిష్టి వైఫల్యాన్ని ప్రదర్శించాయి. ఫలితంగా ప్లే ఆఫ్ కు అవి చేరుకునేది కష్టమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 4:53 pm

IPL 2024

Follow us on

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఒకటి, రెండు జట్లు మినహా మిగతావన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి. ఇప్పటివరకు సూపర్ ఓవర్ స్థాయి వరకు ఒక్క మ్యాచ్ రాకపోయినప్పటికీ.. చివరి ఓవర్ వరకు మ్యాచులు కొనసాగుతున్నాయి. ఫలితం విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జట్లు 7, మరికొన్ని జట్లు వారు, ఇంకా కొన్ని జట్లు ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఏవో నెట్టింట చర్చ జరుగుతోంది.

రాజస్థాన్ రాయల్స్

ప్రస్తుతం పాయింట్లు ప్రకారం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. సంజు నాయకత్వంలో ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కటే ఓటమిని ఎదుర్కొంది.. ఐదు విజయాలు సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఈ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుందని భావిస్తున్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఈ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ జట్టు 4 విజయాలు దక్కించుకుంది. బౌలింగ్ విభాగంలో ఈ జట్టు ఆటగాళ్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. తక్కువ స్కోరు మ్యాచ్ ను కూడా కాపాడుకుంటున్నారు. ఈ జట్టులో బ్యాటింగ్ భారాన్ని ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే మోస్తున్నారు. అదే ఈ జట్టుకు మైనస్ పాయింట్. ఇక ఫీల్డింగ్ విషయంలోనూ ఈ జట్టు ఆటగాళ్లు మ్యాజిక్ చేస్తున్నారు. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

చెన్నై

ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఈ జట్టు నాలుగు విజయాలు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. కొత్త కెప్టెన్ గైక్వాడ్ సమర్థవంతంగా జట్టును నడిపిస్తున్నాడు. శివం దుబే, కెప్టెన్ గైక్వాడ్ బ్యాటింగ్ విభాగంలో కీలకంగా మారారు. బౌలింగ్ లోనూ అద్భుతాలు సృష్టించగల బౌలర్లు చెన్నై జట్టుకు ఉన్నారు. చివర్లో ధోని మెరిపించే మెరుపులు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి.

హైదరాబాద్

ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ఈ జట్టు నాలుగు విజయాలు దక్కించుకుంది. కోల్ కతా, గుజరాత్ చేతిలో ఓడిపోయిన ఈ జట్టు.. పంజాబ్, చెన్నై, ముంబై, బెంగళూరు జట్లపై విజయాలు దక్కించుకుంది. ముంబై జట్టుపై జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు సాధించింది. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అంతకుమించి అనేలాగా ఆడింది. ఏకంగా 287 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ చరిత్ర లిఖించింది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై లాగా నాలుగు విజయాలు సాధించినప్పటికీ నెట్ రేటు తక్కువగా ఉండడంతో హైదరాబాద్ 4వ స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో హైదరాబాద్ జట్టు కొనసాగుతోంది. ఈ చెట్టు కూడా ప్లే ఆఫ్ వెళ్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్, లక్నో జట్లు ప్లే ఆఫ్ కు చేరేంత సత్తా ఉన్నప్పటికీ.. అవి ఇటీవల మ్యాచులలో సమిష్టి వైఫల్యాన్ని ప్రదర్శించాయి. ఫలితంగా ప్లే ఆఫ్ కు అవి చేరుకునేది కష్టమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

ఇక వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు జట్టు.. ఈ సీజన్లో ప్లే ఆఫ్ వెళ్ళేది కష్టమే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటే విజయాన్ని నమోదు చేసిన బెంగళూరు.. ప్లే ఆఫ్ చేయాలంటే వచ్చే మ్యాచ్లు మొత్తం గెలవాలని.. గెలవడం మాత్రమే కాదని.. నెట్ రన్ రేట్ భారీగా ఉండాలని.. అప్పుడే బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బెంగుళూరు ప్లే ఆఫ్ చేరేది అనుమానమేనని వారు అంటున్నారు. ఐపీఎల్ ప్రారంభమై 16 సీజన్లు పూర్తయినా ఇంతవరకు బెంగళూరు కప్ దక్కించుకోలేదు.. ఈసారైనా కప్ సాధిస్తుందనుకుంటే వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది.. లీగ్ దశలోనే ఇంటికి వెళ్లే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.