https://oktelugu.com/

Jasprit Bumrah :  బుమ్రా బంతికి.. పోప్ వద్ద సమాధానం లేకపోయింది.. బాల్ ఆఫ్ ది ఇయర్ -24 ఇదే.. వైరల్ వీడియో

టెస్ట్, వన్డే, టి20.. ఇలా ఫార్మాట్ ఏదైనా బుమ్రా ఉన్నాడంటే చాలు టీమ్ ఇండియాకు ఎనలేని ధైర్యం. ఎక్కడా లేని ఉత్సాహం. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా వెనుకబడిపోయినప్పటికీ.. వికెట్ల విషయంలో బుమ్రా మాత్రం నెంబర్ వన్ గా ఉన్నాడు.. పాట్ కమిన్స్, స్టార్క్, బోలాండ్, లయన్ వంటి వారు కూడా బు ఘనతను అందుకోలేకపోయారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 1, 2025 / 09:39 PM IST

    Jasprit Bumrah

    Follow us on

    Jasprit Bumrah :  గత ఏడాది బుమ్రా టెస్ట్ క్రికెట్లో అదరగొట్టాడు. భీకరమైన ఫామ్ తో వికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు.. సరికొత్త రికార్డులను సృష్టించి తనకు తానే సాటిగా నిలిచాడు. అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించిన అతడు.. ఈ జాబితాలో నాలుగో బౌలర్ గా నిలిచాడు.. టీమిండియాలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళకు కూడా దక్కని ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. అయితే బుమ్రా గత ఏడాది అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టులు తన విశ్వరూపాన్ని చూపించాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి.. టీమిండియాను తిరుగులేని స్థానంలో నిలిపాడు. అందువల్లే ఆ సిరీస్ లో టీమిండియా నాలుగు టెస్టులలో వరుసగా గెలిచింది. నాటి గెలుపుతో వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అదే ఊపును బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో కూడా కొనసాగించింది. బంగ్లాదేశ్ పై ఏకంగా రెండు టెస్టు మ్యాచ్లో గెలిచి.. సరికొత్త రికార్డు సృష్టించింది. కానీ ఆ తర్వాత న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది.

    బిత్తర పోయిన పోప్

    గత ఏడాది జనవరిలో ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు మనదేశంలో పర్యటించింది. తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించింది. అయితే విశాఖపట్నంలో జరిగిన రెండు టెస్టులో బజ్ బాల్ గేమ్ ఆడింది. అయినప్పటికీ టీమిండియా ఎదుట విఫలమైంది. అయితే ఆ టెస్టులో బుమ్రా అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు పోప్ ను అవుట్ చేశాడు. బుమ్రా వేసిన అత్యంత వేగవంతమైన యార్కర్ కు పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతి అత్యంత వేగవంతంగా ఉండడంతో దానిని అడ్డుకోలేక పోప్ అలా బ్యాట్ ఎత్తేసాడు. దీంతో మూడు వికెట్లు అలా నేల కూలాయి. దీంతో పోప్ నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు.. గత ఏడాది టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన యార్కర్ ఇదేనంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బుమ్రా ను ఉద్దేశిస్తూ.. “అద్భుతమైన వికెట్ తీశావు.. సూపర్ బౌలింగ్ వేశావు.. నీకు నువ్వే సాటి.. నువ్వు వేసిన బంతి గత ఏడాది చరితార్ధంగా నిలిచింది. ఇలానే నువ్వు దూసుకుపో. అది బాల్ ఆఫ్ ద ఇయర్-2024 గా నిలిచిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.