Gautam Gambhir : ఇటీవల జరిగిన మెల్ బోర్న్ టెస్టులో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగానే నిరాశ జనకమైన ఆట తీరును ప్రదర్శించాడు. అతడు జాగ్రత్తగా ఆడినప్పటికీ.. తర్వాత తనకు అలవాటైన రీతిలో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా అలానే వికెట్ సమర్పించుకున్నాడు. రాహుల్ అయితే 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇక రిషబ్ పంత్ అయితే అత్యంత నిర్లక్ష్యంగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. కీలక ఆటగాళ్ల వైఫల్యం వల్ల గెలవాల్సిన మ్యాచ్ ను టీమిండియా ఆస్ట్రేలియా చేతుల్లో పెట్టింది. ఇటీవల కాలంలో టీమిండియా అత్యంత దారుణంగా ఆడిన మ్యాచ్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. ప్రాక్టీస్ సమయంలో.. మెరుగు ఆడుతున్న ఆటగాళ్లు.. మైదానంలోకి వెళ్లేసరికి వేరే ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. అత్యంత నిరాశాజనకమైన ఫలితాలను అందిస్తున్నారు. ఇది జట్టు మేనేజ్మెంట్ కు, కోచ్ గౌతమ్ గంభీర్ కు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత ఆటగాళ్లకు ఆరు నెలల పాటు సమయం ఇచ్చాడు. స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు. అయితే ఆటగాళ్లు మాత్రం అందుకు విరుద్ధంగా ఆడుతూ జట్టు పరువు తీస్తున్నారు. ఏ మాత్రం ఆసక్తి లేని ఆట తీరు ప్రదర్శిస్తూ పరువు తీసుకుంటున్నారు.
వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్
ఇటీవల మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. ఆ సమయంలో భారత డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కింది. సీనియర్ ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు..” ప్రాక్టీస్ సమయంలో మెరుగ్గా ఆడుతున్నారు కదా. నెట్స్ లో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా.. టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఎందుకు మారుతోంది? పదేపదే చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తున్నది? చెప్పిన ప్రణాళికలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకలా బ్యాట్లు ఎత్తేస్తున్నారు? ఇలా అయితే కష్టమేనని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి . ఇక ఇటీవల భారత్ అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత.. జట్టులోకి పూజా రాను తీసుకోవాల్సిన అవసరాన్ని గౌతమ్ గంభీర్ జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. అయితే పూజ రాను ఎందుకు జట్టులోకి తీసుకోలేదనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. మరోవైపు ఆటగాళ్లు నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తే.. దారుణంగా బౌలింగ్ చేస్తే.. కచ్చితంగా చర్యలు ఉంటాయని గౌతమ్ గంభీర్ హెచ్చరించాడు. అలాంటి చర్యలు తీసుకుంటేనే ఆటగాళ్లలో బాధ్యత పెరుగుతుందని.. మెరుగైన ఇన్నింగ్స్ ఆడతారని.. జట్టు విజయాలకు తోడ్పడుతారని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. అయితే దీనికి జట్టు మేనేజ్మెంట్ ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాల్సి ఉంది.