Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan century against Bangalore plea: ప్లీజ్ ఇషాన్ కిషన్.. బెంగళూరు పై సెంచరీ...

Ishan Kishan century against Bangalore plea: ప్లీజ్ ఇషాన్ కిషన్.. బెంగళూరు పై సెంచరీ చేయకు

Ishan Kishan century against Bangalore plea: క్రికెట్ లో కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి. జెంటిల్మెన్ లాంటి గేమ్ లో.. ఇటువంటి మూఢనమ్మకాలకు ఆస్కారం ఎక్కడిది అని చాలా మంది కొట్టి పారేయవచ్చు. కానీ, కొంతమంది అభిమానులకు అటువంటి నమ్మకాలు కచ్చితంగా ఉంటాయి. అందువల్లే అది రిపీట్ కావద్దని కోరుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ జట్టు ఐపిఎల్ తొలి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులు సరికొత్త కోరిక కోరుకుంటున్నారు. అది రిపీట్ కావద్దని భగవంతుడిని వేడుకుంటున్నారు.

శనివారం ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్లో హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో సారథిగా అతడికి ఇదే తొలి మ్యాచ్. డొమెస్టిక్ క్రికెట్లో.. అంతకుముందు అండర్ 19 కప్ లో సారధ్య బాధ్యతలు వహించిన నేపథ్యం అతనికి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టును అతడు మెరుగైన స్థితిలో నడిపిస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోంది. 2024 లో ఫైనల్ వెళ్లిన హైదరాబాద్ జట్టు.. 2025లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో అభిషేక్ ను సారధిగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అభిషేక్ స్థానంలో ఇషాన్ కిషన్ కు మేనేజ్మెంట్ కెప్టెన్ పగ్గాలు అప్పగించింది.. ఇది తాత్కాలికమని మేనేజ్మెంట్ చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే కమిన్స్ పూర్తిస్థాయిలో కెప్టెన్సీ వహించే అవకాశాలు కనిపించడం లేదు. పైగా అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.

ఇషాన్ కిషన్ సారధిగా జట్టును నడిపిస్తున్న క్రమంలో.. ఒకవైపు మోదం ఉన్నప్పటికీ.. మరోవైపు ఖేదం కనిపిస్తోంది. ఎందుకంటే గతి సీజన్ ద్వారా హైదరాబాద్ జట్టులోకి ప్రవేశించిన కిషన్.. తొలి మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై సెంచరీ చేశాడు. తనమీద భారీగా అంచనాలు పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడు వరుసగా విఫలమయ్యాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకుంది.

ప్రస్తుతం కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. అంతకుముందు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు. తొలిసారిగా ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో కిషన్ గత సీజన్లో మాదిరిగా సెంచరీ చేయకూడదని.. అభిమానులు కోరుకుంటున్నారు. సాధారణ ఇన్నింగ్స్ ఆడి.. ఆ తర్వాత మ్యాచ్లలో సత్తా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. “ఇషాన్ కిషన్ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాం. అతడు సరిగా ఆడకపోతే మేము మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. అతడు సమర్థవంతంగా ఆడాలి. అంచనాలను నిజం చేసే పని చేయాలి. అలా చేయాలంటే ముందుగా అతడు సాధారణ ఆట తీరుతోనే కనిపించాలని” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version