Homeఎంటర్టైన్మెంట్Prabhas Monthly Expenses: ప్రభాస్ ఒక నెల ఖర్చుతో 10 కుటుంబాలు బతకవచ్చు... వైరల్ న్యూస్...

Prabhas Monthly Expenses: ప్రభాస్ ఒక నెల ఖర్చుతో 10 కుటుంబాలు బతకవచ్చు… వైరల్ న్యూస్…

Prabhas Monthly Expenses: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు… ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులందరు అతనికి అభిమానులుగా మారిపోయారు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రభాస్ ని ఢీకొట్టే హీరోలు ఇంకెవరు కనిపించడం లేదు. తన సినిమాకి ప్లాపు టాక్ వచ్చిన కూడా అవి ఈజీగా 300 నుంచి 400 వందల కోట్ల వరకు వసూళ్లను రాబడుతున్నాయి. ఇక మిగతా హీరోలందరు కూడా ప్రభాస్ ని చూసి చాలా వరకు నేర్చుకోవాలి. ఆయన స్టోరీస్ ఎలక్షన్ కూడా బాగుంటుంది. సలార్, కల్కి లాంటి సినిమాలతో వరుసగా రెండు భారీ సక్సెస్ లను సాధించిన ఆయన రాజాసాబ్ సినిమాతో కొంతవరకు డీలా పడిపోయిన కూడా ఇప్పుడు ఫౌజీ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఎలాగో వచ్చే సంవత్సరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుందనేది వాస్తవం. ఇక ఈ క్రమంలోనే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు ప్రపంచవ్యాప్తంగా ఆయన మార్కెట్ ఇంకా పెరుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Also Read: ‘కాంతారా’ టీంని ఇన్ స్టాగ్రామ్ లో ‘Unfollow’ కొట్టిన రిషబ్ శెట్టి.. అసలు ఏమి జరుగుతోంది..

ప్రభాస్ తన లైఫ్ స్టైల్ ని చాలా సింపుల్ గా గడుపుతాడు అని అందరూ అంటారు. కానీ ఆయన ఒక నెల రోజులకు దాదాపు 30 లక్షల వరకు ఖర్చు చేస్తూ ఉంటారట.
తను ఫూడీ అవ్వడంతో తనకు నచ్చిన ఫుడ్ తింటూ అలాగే తన లైఫ్ స్టైల్ ను చాలా రిచ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడట. తన ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఆయన ఒక నెలకి 30 లక్షల రూపాయలను ఖర్చు పెడతాడని తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయన నెలకి 30 లక్షలు ఖర్చుపెడుతున్నాడంటే దాంతో దాదాపు ఒక 10 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఒక సంవత్సరం పాటు ఈజీగా బతికేయచ్చు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version