PKL 2025 final Highlights: మనదేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. మన జట్టు తలపడే మ్యాచ్ చూసేందుకు ప్రపంచంలో ఎక్కడికైనా సరే భారతీయులు వెళ్తుంటారు. ఇక టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి చూసేవారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. అందువల్లే క్రికెట్ ఆధారంగా సాగే వ్యాపారాలు మనదేశంలో ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ క్రికెట్ గమ్యస్థానం మొత్తం మన దేశం చుట్టూ కేంద్రీకృతం కావడానికి కారణం కూడా ఇదే.
అయితే ఇటీవల కాలంలో మిగతా క్రీడల్లోకి కార్పొరేట్ కంపెనీలు అడుగుపెట్టడంతో.. రకరకాల టోర్నీలు జరుగుతున్నాయి. వర్తమాన ప్లేయర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా క్రీడలకు సరికొత్త ఫ్లేవర్.. ఇతర నిబంధనలను యాడ్ చేయడంతో అవి కాస్త సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కూడా కారణం అదే.
ప్రో కబడ్డీ లీగ్(Pro Kabaddi league 2025) ఇప్పటికే 11 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా 12వ సీజన్ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీ(dabang Delhi champions) విజయం సాధించింది. పూనేరి పల్టాన్ (puneri paltan) జట్టు రన్నర్ అప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ అభిమానులకు అద్భుతమైన కబడ్డీ మజా అందించింది. కబడ్డీలో తే స్థాయిలో ఉత్కంఠ ఉంటుందో ఈ మ్యాచ్ ప్రేక్షకులకు రుచి చూపించింది.
ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి పుట్టింది జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే రెండవ అంకంలో దారుణంగా తరబడింది. ట్యాకిల్స్ విషయంలో తడబడింది. దీనికి తోడు పేలవమైన రైడ్స్ వల్ల పాయింట్లు సమర్పించుకుంది. దీంతో ఒక్కసారిగా పూనే జట్టు రంగంలోకి వచ్చింది. అయితే చివరి క్షణంలో ఢిల్లీ జట్టు మళ్లీ పుంజుకోవడంతో ఛాంపియన్గా అవతరించింది.
తొలి అర్ధ భాగంలో పూణే జట్టును ఢిల్లీ జట్టు ఒకసారి అలౌట్ చేసింది. 20-14 తో లీడ్ లో నిలిచింది. రైడింగ్ లో ఏకంగా ఢిల్లీ జట్టు 13 పాయింట్లు సాధించింది. అంతేకాదు మూడు ట్యాకిల్ పాయింట్లు దక్కించుకుంది.. అయితే రెండవ అర్థం భాగంలో ఢిల్లీ జట్టు పూర్తిగా తడబడింది.. దీంతో ప్రత్యర్థి చేతిలో ఒకసారి ఆల్ అవుట్ కావాల్సి వచ్చింది. ఫలితంగా స్కోర్లు ఈక్వల్ అయిపోయాయి. దీంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. అయితే చివర్లో ఫజల్ కీలకమైన ట్యాకిల్ పాయింట్ సాధించడంతో ఢిల్లీ లీడ్ అందుకుంది. విజయాన్ని కూడా దక్కించుకుంది.. మ్యాచ్ రెండవ అర్థభాగంలో ఢిల్లీ జట్టు నాలుగు రైడింగ్ పాయింట్లు, 5 ట్యాకిల్ పాయింట్లు సాధించింది. పూనే జట్టు ఎనిమిది రైడింగ్ పాయింట్లు, మూడు ట్యాకిల్ పాయింట్లు దక్కించుకుంది.
6️⃣3️⃣ days of grind, sweat and blood for this one moment of #ProKabaddi #PKL12 #GhusKarMaarenge @DabangDelhiKC pic.twitter.com/InFDxNFFGp
— ProKabaddi (@ProKabaddi) October 31, 2025