ICC Meeting In Dubai: డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడ కొడితే ఎలా ఉంటుంది.. ఏముంది దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది.. డిక్కీ బలిసినంత మాత్రాన కోడి తొడకొట్టకూడదు. ఎందుకంటే దాని స్థాయి కొంతవరకే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి నఖ్వీకి ఇది అనుభవంలోకి రానుంది.
Also Read: ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన టీమిండియా.. ఇదీ సూర్య భాయ్ వ్యూహ చతురత!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రమే కాకుండా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు కూడా నఖ్వీ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల ఆసియా కప్ ఫైనల్ లో టీం ఇండియా పాకిస్తాన్ జట్టు మీద విజయం సాధించింది. ట్రోఫీ వరుసగా రెండవసారి సాధించింది. అయితే సరిహద్దుల్లో ఏర్పడిన వివాదాలు.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు నఖ్వీ వ్యవహరించిన తీరు.. మననం లో పెట్టుకున్న భారత ప్లేయర్లు అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోలేదు. ట్రోఫీని అందుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీమ్ ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించలేదు. దీనిపై పాకిస్తాన్ ప్లేయర్లు రకరకాలుగా మాట్లాడారు.. చివరికి మ్యాచ్ రిఫరనీ కూడా తప్పు పట్టారు.. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ సమయంలో న్యూట్రల్ గా వ్యవహరించాల్సిన నఖ్వీ పాకిస్తాన్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించారు. ఇది టీమ్ ఇండియాకు ఆగ్రహాన్ని కలిగించింది.
పంటి కింద రాయి లాగా మారిన నఖ్వీ తో తాడో పేడో తేల్చుకోవాలని బిసిసిఐ నిర్ణయించుకుంది. ఈనెల 7న జరిగే ఐసీసీ మీటింగ్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు నఖ్వీ కి గట్టి బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఇటీవల ఆసియా కప్ సాధించిన టీమిండియాకు ట్రోఫీని అప్పగించడంలో నఖ్వీ విఫలమయ్యారు. దీనిపై అతడిని నిలదీయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. నఖ్వీ పై తీవ్రస్థాయిలో అభియోగాలను రూపొందించింది. పాకిస్తాన్ మంత్రిగా ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి అనర్హుడని.. అతని తప్పించాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ వాదించే అవకాశం ఉంది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మద్దతు తెలిపే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి నఖ్వీ హాజరు కాకపోవచ్చని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.. ” అతనిపై బీసీసీఐ అనేక రకాలుగా కార్యాచరణ రూపొందించింది. అతడికి వ్యతిరేకంగా అభియోగాలను సిద్ధం చేసింది. అతని వ్యవహార శైలిని ప్రపంచం ముందు ఉంచడానికి సిద్ధమైంది. ఈ సమయంలో అతడు తన పదవిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటప్పుడు అతడు ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్చని” జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.