Viral Video: మత్తు అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది శరీరాన్ని పూర్తిగా నిస్తేజంగా మార్చుతూ ఉంటుంది. మైకంలో ఉండేలా చేస్తుంది. మైకంలో ఉన్నవారు కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. ఇటీవల కాలం లో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మద్యం తాగడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ మద్యం తాగే వారు ఆ అలవాటును మానుకోలేక పోతున్నారు. కేవలం మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
మద్యం తాగడాన్ని కొంత మంది స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అలా మద్యం తాగడం వల్ల ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో తెలిసినప్పటికీ ఆ అలవాటును మానుకోలేరు. పైగా అలా మద్యం తాగడం వల్ల వారు ఇతరులకు హాని కలిగిస్తారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ మద్యం తాగేవారు తమ ధోరణి మార్చుకోలేకపోతున్నారు. పైగా మరింత ఎక్కువ స్థాయిలో మద్యం తాగడం వల్ల ఇతరులకు ఇబ్బందులు మాత్రమే కాదు.. ప్రత్యక్ష నరకాన్ని రుచి చూపిస్తున్నారు.. అలాంటి సంఘటన ఒకటి జరిగింది.. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. ఈనెల 6న ఓ అమ్యూజ్మెంట్ పార్కులో దారుణం చోటుచేసుకుంది. ఆ పార్కులో భారీ స్కై వీల్ ఉంది. దానిని ఆపరేట్ చేసే వ్యక్తి విపరీతంగా మద్యం తాగాడు. ఆ మధ్యమధ్యలో ఆ స్కై వీల్ ను ఆన్ చేశాడు.. ఆ తర్వాత దానిని ఆఫ్ చేయడం మర్చిపోయాడు. దీంతో ఆ స్కై వీల్ గంటకు పైగా తిరిగింది. దీంతో అందులో ఉన్న వారంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. అమ్యూజ్మెంట్ పార్కులో ఆనందంగా గడపాలని వచ్చిన వారంతా గందరగోళానికి గురయ్యారు.. ఆ వీల్ అలానే తిరుగుతూ ఉండడంతో చాలామంది భయంతో కేకలు వేశారు.. దానిని నిలుపుదల చేయాలని పదేపదే కోరినప్పటికీ ఆపరేటర్ పట్టించుకోలేదు. జెయింట్ వీల్ అదుపు లేకుండా తిరగడంతో అందులో ఉన్న వాళ్లంతా కేకలు వేశారు.. విపరీతంగా అరిచారు.
ఈ దృశ్యాన్ని మొత్తం ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు. అక్కడ పర్యాటకులు ఎదుర్కొన్న భయానక పరిస్థితిని అతడు కళ్ళకు కట్టే విధంగా చూపించాడు. ఈ వీడియో చూసిన వారంతా ముక్కున వేలుసుకుంటున్నారు.. వామ్మో ఆనందం కోసం పార్కుకి వెళ్తే ఇలా కూడా జరుగుతుందా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే ఈ దృశ్యం ఎక్కడ చోటు చేసుకున్న విషయం తెలియ రాలేదు. కాకపోతే ఆ వీడియో మాత్రం అత్యంత భయానకంగా ఉంది.. అందులో ఉన్న పర్యాటకుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Use Headphones
Sky Wheel Ride gone haywire
The operator was drunk and let the Sky Wheel kept running for more than an Hour
A panic stricken person on the Sky Wheel Recorded this abusive rant pic.twitter.com/USKx4RDBv9
— Woke Eminent (@WokePandemic) November 4, 2025