Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: ఈ రెండు రాశుల వారికి శ్రీరాముడి అనుగ్రహం.. జీవితంలో ఎప్పుడు...

Today Horoscope In Telugu: ఈ రెండు రాశుల వారికి శ్రీరాముడి అనుగ్రహం.. జీవితంలో ఎప్పుడు చూడని సంతోషం..

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్రా ప్రభావం ఉందనింది. ఈరోజు శ్రీరామనవమి వేళ నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చులు తగ్గించుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులతో కలిసి మెలిసి ఉంటారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అవి కచ్చితంగా భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఓ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు ఈరోజు ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతున్న ఖర్చుల విషయంలో కేర్ తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దీంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. ఓ రంగం వారికి డబ్బు అనుకోకుండా వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఏ పని చేపట్టిన దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ లక్ష్యంగా ఉంటే నష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి మద్దతు ఉండడం వల్ల వ్యాపారులు లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఎప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మానసికంగా ఆనందంగా ఉంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే తప్పకుండా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం వారు కొన్ని కీలక నిర్ణయం తీసుకుంటారు. వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం. ఉద్యోగులు కార్యాలయాలనుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టేముందు బాగా ఆలోచించాలి. కొన్ని విషయాల్లో వీరికి అదృష్టం కలుగుతుంది. ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం తగ్గే అవకాశం. దీంతో ఆందోళనగా ఉంటారు. శివాజిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అయితే ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను ఆశ్రయించాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. అధిక ప్రసంగం వల్ల తీవ్రంగా నష్టపోతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందర పడొద్దు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వచ్చిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు తక్కువగానే ఉంటుంది. అయితే వారి ప్రేమానురాగాలను పొందడానికి మాటల మాధుర్యాన్ని పెంచాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : రాశి వ్యాపారాలు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి ఆశించిన లాభాలు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. లేకుంటే సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వివాహితులు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వారి దగ్గర నైనా అప్పు తీసుకుంటే దానిని వెంటనే చెల్లిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఖర్చులను అదుపులో ఉంచుతారు. ప్రియమైన వారితో కలిసి షాపింగ్ చేస్తారు. చట్టపరమైన చిక్కులు ఉంటే నీటితో తొలగిపోతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితులకు దూరంగా ఉండాలి. అనవసరపు ఆందోళనకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారికి ఈ రోజు శ్రీరామనవమి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే అవి లాభాలు వస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇతరులతో పోలిస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అచ్చులు అదుపులోకి వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి శ్రీరాముడి అనుగ్రహం ఉండనుంది. మీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తే సంతోషంగా ఉంటారు. నాణ్యమైన ఆహారం పైనే దృష్టి పెట్టాలి. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. అయితే ఇదే సమయంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version