PBKS Vs DC IPL 2025: జైపూర్ లో ఢిల్లీతో తలపడిన మ్యాచ్లో పంజాబ్ ఓటమిపాలైంది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో తలవంచింది.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్లు నష్టపోయి 206 రన్స్ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ ను ఢిల్లీ సేన 4 వికెట్లు నష్టపోయి ఫినిష్ చేసింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విక్టరీ అందుకుంది. ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి అదరగొట్టారు. కరుణ్ నాయర్ సత్తా చూపించారు.
సమీర్ రిజ్వీ ఈ సీజన్లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 22 బాల్స్ ఫేస్ చేసిన అతడు.. 50 రన్స్ స్కోర్ చేశాడు. అతడు 25 బాల్స్ లో 58 రన్స్ స్కోర్ చేశాడు. చివరి వరకు అతడు క్రీజ్ లో ఉండి.. అదరగొట్టాడు. రిజ్వి ఖాతాలు మూడు బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. కరుణ్ నాయర్ 27 బాల్స్ లో 44 రన్స్ స్కోర్ చేశాడు. నాయర్ ఐదు బౌండరీలు కొట్టాడు. రెండు సిక్సర్లు సాధించాడు. ఇక ఢిల్లీ ఓపెనర్లు రాహుల్ (35), ఫాఫ్ డూ ప్లెసిస్(23) మెరుగైన ఆరంభాన్ని అందించారు. వన్ డౌన్ ప్లేయర్ సేథిఖుల్లా అటల్(22) మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక పంజాబ్ బౌలర్ హరిప్రీత్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే చెరో వికెట్ నేల కూల్చారు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్స్ లో 206 రన్స్ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచింది. పంజాబ్ ప్లేయర్ స్టోయినీస్ 44, అయ్యర్ 53 రన్స్ చేసి అదరగొట్టారు. స్టోయినీస్ వీరోచిత బ్యాటింగ్ వల్ల పంజాబ్ స్కోర్ 200 మార్క్ దాటింది. పంజాబ్ జట్టు తరఫున నేహల్ వదేరా(16), శశాంక్ సింగ్ (11) పర్వాలేదనిపించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజర్ మూడు వికెట్లు సాధించాడు. కులదీప్ యాదవ్, విప్రజ్ నిగం చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేష్ ఒక వికెట్ సాధించాడు.
లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడిన ఢిల్లీ చివరి మ్యాచ్లో విజయం సాధించింది. ఏకంగా సిక్స్ వికెట్లు తేడాతో విజయం అందుకొని తన గౌరవాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో అయ్యర్ సేన ఓడిపోయిన నేపథ్యంలో.. టాప్ -2 కు చేరడం ఇబ్బందికరంగా మారింది. ఇక పంజాబ్ తన తదుపరి మ్యాచ్ 26న ముంబైతో ఆడాల్సి ఉంది. అయితే చేజింగ్ సమయంలో ఢిల్లీ ప్లేయర్ సమీర్.. చివరి ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి తిరుగులేని విజయాన్ని అందించాడు. తద్వారా పంజాబ్ జట్టుకు టాప్ -2 స్థానాన్ని దూరం చేశాడు.అయితే మ్యాచ్ చివరి వరకు ప్రేక్షకులకు అమితమైన క్రికెట్ ఆనందం లభించింది.. టెన్షన్, ఒత్తిడి, ఉత్కంఠ కలబోతతో మ్యాచ్ సాగింది.