Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు బుధాదిత్య యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మీషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ప్రియమైన జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెండింగ్లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు కెరీర్ పరంగా బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ సభ్యులతో వాగ్వాదానికి దూరంగా ఉండాలి. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు మిస్సమ్మ ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఏ రోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆర్థిక మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో విలువైన విషయాలు చర్చిస్తారు. అవసరపు వివాదాల్లో తలదుచుకోవద్దు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. సంబంధం లేని విషయాల్లో తల దూర్చకుండా ఉండాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేయకుండా ఉండాలి. పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే పూర్తి చేయగలుగుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కీలకమైన విషయంపై చర్చిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అదనపు బాధ్యతలు అందుతాయి. కొందరు లక్షలు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి విభేదాలు ఉంటాయి. ఈ కారణంగా మానసికంగా ఆందోళనతో ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు స్థానం మార్పు కోసం అధికారుల నుంచి మద్దతు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సీరియల్ మద్దతు ఉంటుంది. విద్యార్థులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుడుమ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. పిలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. తల్లిదండ్రులతో వాగ్వాదానికి దూరంగా ఉండాలి.