WTC Final 2025 Pat Cummins: ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంగారు జట్టు 212 పరుగులు చేసింది. ప్రతిగా ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రోటీస్ జట్టు 138 పరుగులకు కుప్పకూలింది. 74 పరుగులు వెనుకబడింది. ఒకానొక దశలో ప్రోటీస్ జట్టు 125/5 పటిష్ట స్థితిలో ఉండగా.. ఆ తర్వాత కేవలం 13 పరుగుల వ్యవధిలోని మిగతా అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో ప్రోటీస్ జట్టు తన బలహీనతను మరొకసారి బయటపెట్టుకుంది. ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్ చేరుకోవడంతో ప్రోటీస్ జట్టు ఇబ్బందుల్లో పడింది. వాస్తవానికి డబ్ల్యూటీసీ తుది పోరుకు తొలిసారి ప్రోటీస్ జట్టు ఎంపికయింది. కాకపోతే తుది పోరులో ఆ స్థాయిలో సత్తా చూపించలేకపోతోంది.. కంగారు జట్టు బౌలర్లకు దాసోహం అయింది.. ముల్డర్ (6), బవుమా(36), బెడింగ్ హమ్(45), వెర్రినే(13), జాన్సన్ (0), రబాడా(1) వికెట్లను కమిన్స్ పడగొట్టాడు. తద్వారా కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు..
సారధిగా ఐదు వికెట్ల ఘనత సాధించిన ప్లేయర్ జాబితాలో ఏకంగా మూడవ స్థానాన్ని ఆక్రమించాడు. జాబితాలో పాకిస్తాన్ ఒకప్పటి సారథి ఇమ్రాన్ ఖాన్ 12సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు..బీ నాడ్ 9సార్లు, కమిన్స్ 9సార్లు, బిషన్ సింగ్ బేడి 8సార్లు, కోట్నీ వాల్ష్ ఏడుసార్లు, జాన్సన్ హోల్డర్ ఏడుసార్లు ఐదు వికెట్లు సాధించిన ఘనత అందుకున్నారు.. ఇక ఈ మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్టులలో 300 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. కంగారు జట్టు తరఫున 300 వికెట్లు పడగొట్టిన ఎనిమిదో బౌలర్ గా కమిన్స్ ఆవిర్భవించాడు.
ఇటీవల జరిగిన ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టుకు సారధిగా కమిన్స్ వ్యవహరించాడు. గత సీజన్లో హైదరాబాద్ జట్టును అతడు తుది పోరు దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ ఆ మ్యాచ్ లో షారుక్ ఖాన్ జట్టు గెలిచింది. ఇక ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ఆడ లేక పోయింది. వరుస ఓవటములతో ఇబ్బంది పడింది. ఇక చివరి మూడు మ్యాచ్లను గెలిచి.. గౌరవప్రదమైన స్థానాన్ని సాధించింది. అయితే హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించలేకపోయినప్పటికీ.. కమిన్స్ తన జట్టుకు డబ్ల్యూటీసీ ట్రోఫీ అందించేలా ఉన్నాడు. గత సీజన్లో తన జట్టుకు డబ్ల్యూటీసీ ట్రోఫీని కమిన్స్ అందించాడు. అంతేకాదు అంతకుముందు వన్డే వరల్డ్ కప్ కూడా దక్కేలా చేశాడు. మొత్తంగా కంగారు జట్టుకు ఐసిసి మెజర్ ట్రోఫీలు అందించి.. ఆ జట్టుకు సరికొత్త సారధిగా నిలిచాడు కమిన్స్.