Plane Crash Compensation: ఈ ప్రమాదంలో దాదాపు రెండు వందల మందికి పైగా మరణించారని తెలుస్తోంది. మనదేశంలో చోటు చేసుకున్న ప్రమాదాలలో ఇదే అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా విమాన ప్రమాదాలలో చనిపోయిన వారికి విమానయన సంస్థలు పరిహారం చెల్లిస్తాయి. అయితే అంతర్జాతీయ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు మాంట్రియల్ కన్వెన్షన్ -1999 ప్రకారం విమానయాన సంస్థ పరిహారం చెల్లించాలి. కారణాలతో సంబంధం లేకుండానే ఒక్కో ప్రయాణికుడికి 1.4 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని సమాచారం. అలాగే ప్రయాణ బీమా ఉన్న వాళ్లకు యాక్సిడెంటల్ మరణం కింద 25 లక్షల నుంచి కోటి వరకు పరిహారం లభిస్తుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం గనుక పొందితే ఐదు నుంచి పది లక్షల వరకు పరిహారం లభిస్తుంది. ఇక అహ్మదాబాద్ ఘటనలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన నేపథ్యంలో టాటా గ్రూప్ స్పందించింది.
Also Read: విజయ్ రూపాని నుంచి మొదలు పెడితే మనదేశంలో విమాన ప్రమాదాల్లో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లే..
ఇక అహ్మదాబాద్ ఘటన జరిగిన నేపథ్యంలో టాటా గ్రూప్ విచారణ వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు అవసరమయ్యే వైద్య ఖర్చులు మొత్తం తామే భరిస్తామని వెల్లడించింది. అంతేకాదు విమానం కూలిపోవడం వల్ల ధ్వంసమైన బీజే వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రకటించింది.
ఈ విమానం 242 ప్యాసింజర్లతో ప్రయాణం ప్రారంభించింది.. పైగా విమానం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీం లైనర్.. అకస్మాత్తుగా గురువారం మధ్యాహ్నం కూలిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. పైగా అది మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది.. ఫలితంగా ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. హాస్టల్ ప్రమాదం వల్ల ధ్వంసం కావడంతో.. నిర్మాణానికి సహకారం అందిస్తామని ఇప్పటికే టాటా గ్రూప్ ప్రకటించింది.. అయితే ఈ ప్రమాదం విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలడంతో ప్రాణా నష్టం తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇక హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన దగ్గర భీతావాహ దృశ్యం నెలకొంది. ప్రమాదం వల్ల మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మొత్తం ధ్వంసం అయింది.. భారీగానే ఆస్తి నష్టం ఏర్పడింది. అయిన వాళ్ళని కోల్పోయి వారి బంధువులు పెడుతున్న ఆర్తనాదాలు కలచి వేస్తున్నాయి.
#WATCH | Air India plane crashes in Ahmedabad; Thick smoke and dust emerge as an impact of the plane crash pic.twitter.com/JLPApIfPnU
— ANI (@ANI) June 12, 2025