Homeక్రీడలుక్రికెట్‌Pat Cummins SRH captaincy update: కమిన్స్ వచ్చాడు.. ఇషాన్ పరిస్థితి ఏంటి.. SRH కెప్టెన్...

Pat Cummins SRH captaincy update: కమిన్స్ వచ్చాడు.. ఇషాన్ పరిస్థితి ఏంటి.. SRH కెప్టెన్ గా ఉండేది ఎవరో..

Pat Cummins SRH captaincy update: ప్రస్తుత ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు ఆట తీరు స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. రెండవ మ్యాచ్లో గెలిచిన తర్వాత.. తర్వాతి రెండు మ్యాచ్లలో వరుసగా ఓటములు ఎదురైన తర్వాత.. హైదరాబాద్ జట్టు ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. బౌలింగ్లో వైఫల్యం కనిపించడం లేదు. బ్యాటింగ్లో సామర్థ్యం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా జట్టను ఇషాన్ కిషన్ నడిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. అందువల్లే హ్యాట్రిక్ […]

Pat Cummins SRH captaincy update: ప్రస్తుత ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు ఆట తీరు స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. రెండవ మ్యాచ్లో గెలిచిన తర్వాత.. తర్వాతి రెండు మ్యాచ్లలో వరుసగా ఓటములు ఎదురైన తర్వాత.. హైదరాబాద్ జట్టు ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. బౌలింగ్లో వైఫల్యం కనిపించడం లేదు. బ్యాటింగ్లో సామర్థ్యం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా జట్టను ఇషాన్ కిషన్ నడిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. అందువల్లే హ్యాట్రిక్ విజయాలను హైదరాబాద్ జట్టు నమోదు చేసింది.

సొంత గడ్డమీద అద్భుతమైన విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో శనివారం జరిగే మ్యాచ్లో కనుక హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే మూడవ స్థానానికి చేరుకుంటుంది. మూడో స్థానానికి చేరుకోవాలని హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇప్పటికే బౌలింగ్ దళం బలం పెంచుకున్న నేపథ్యంలో.. పూర్వ కెప్టెన్ కవిన్స్ జట్టులోకి వచ్చాడు. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న అతడు ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. పూర్తిస్థాయిలో సన్నద్ధత సాధించిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనికి ఎన్వోసీ ఇచ్చింది. దీంతో అతడు జట్టులో భాగమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో శనివారం జరుగుతున్న మ్యాచ్లో అతడు హైదరాబాద్ జట్టులో చేరబోతున్నాడు. ఇప్పటికే ముమ్మరంగా అతడు ప్రాక్టీస్ చేశాడు. అతడు బౌలింగ్ వేసే విధానం పట్ల కోచ్ కూడా సంతృప్తిగా ఉన్నాడు.

ఇన్ని రోజులపాటు హైదరాబాద్ జట్టును నడిపించిన ఇషాన్ కిషన్ ఇకపై కీపర్ పాత్రకు పరిమితం కాబోతున్నాడు. దిల్షాన్ మధు శంక, సలీల్ అరోరా తుది జట్టు నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది.. ప్రఫుల్, సాకీబ్ లాంటి ప్లేయర్లకు అవకాశాలు స్థిరం కాబోతున్నాయి. వారిద్దరికీ రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో చోటు లభించడం ఖాయం. మలింగ కూడా జట్టులో ఉంటాడు. వీరి ముగ్గురికి కమిన్స్ తోడవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ బౌలింగ్ బలం మరింత పటిష్టం కాబోతోంది. ఎలాగూ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్ లో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ జట్టుకు తిరుగు ఉండదు. ఇప్పటికే ఈ సిరీస్లో రాజస్థాన్ మీద హైదరాబాద్ గెలిచింది. ఈసారి రాజస్థాన్ సొంతం మైదానంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ మరింత పటిష్టంగా ఆడాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహించబోతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper