Paris Olympics 2024: భారత్‌ ఖాతాలో మరో పతకం.. మూడో మెడల్‌ అందించిన స్వప్నిల్‌!

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. వివిధ విభాగాల్లో తదుపరి రౌండ్ల దూసుకుపోతున్నారు. ఇక షూటింగ్‌లో అయితే మన క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఇప్పటి రెండు కాంస్యాలు భారత్‌ గొలుచుకోగా, తాజాగా మరో పతకం కూడా చేరింది.

Written By: Raj Shekar, Updated On : August 1, 2024 4:01 pm

Paris Olympics 2024

Follow us on

Paris Olympics 2024: ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షూటింగ్‌ విభాగంగా పతకాలు గెలుచుకుంటున్నారు. ఇప్పటిక హరియాణాకు చెందిన మనూబాకర్‌ రెండు కాంస్య పతకాలను భారత్‌కు అందించింది. తాజాగా అదే విభాగంలో మరో పతకాన్ని భారత్‌ ఖాతాలో చేర్చాడు స్వప్నిల్‌. పురుషుల రైఫిల్‌ 50మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకుని అద్భుతంగా రాణించారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ లో 38 ఇన్నర్‌ 10లతో సహా 60షాట్స్‌ నుంచి 590 పాయింట్లతో టాప్‌ 8 షూటర్లలో స్థానం సంపాదించేందుకు స్వప్నిల్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. స్థిరమైన ప్రదర్శనతో స్వప్నిల్‌ తుదివరకు ముందుకు సాగాడు. కాంస్య పతకం గెలుచుకున్నాడు.

ఇదే మొదటిసారి..
1995, ఆగస్టు 6వ తేదీన పూణేలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు స్వప్నిల్‌ 2009లో స్వప్నిల్‌ తండ్రి అతన్ని మహారాష్ట్రలోని క్రీడా ప్రభోదిని అనే ప్రాథమిక క్రీడా కార్యక్రమంలో చేర్పించారు. అక్కడి నుంచి అతని జర్నీ షురూ అయ్యింది. ఒక ఏడాది కఠినమైన ట్రైనింగ్‌ తర్వాత తను షూటింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. అతని అంకితభావం, ప్రతిభకు త్వరగానే గుర్తింపు లభించింది. 2013లో లక్ష్య స్పోర్‌ట్స నుంచి స్పాన్సర్‌షిప్‌ తీసుకున్నాడు. షూటింగ్‌ ప్రపంచంలో స్వప్నిల్‌ సాధించిన విజయాలేన్నో ఉన్నాయి. 2015లో కువైట్లో జరిగిన ఆసియా షూటింగ్‌ ఛాపింయన్‌షిప్‌ లో 50మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ 3 ఈవెంట్‌ బంగారు పతకం సాధించాడు. తుగ్లకాబాద్‌లో జరిగిన 59వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. చైన్‌సింగ్, గగన్‌ నారంగ్‌ వంటి ప్రముఖ షూటర్లను సైతం అధిగమించి చరిత్ర సృష్టించాడు. తిరువనంత పురంలో జరిగిన 61వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచి విజయాన్ని అందుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌లో స్వర్ణం సాధించాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 4వ స్థానం
ఇదిలా ఉంటే.. 2022లో కైరోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వప్నిల్‌ 4వ స్థానంలో నిలిచాడు. భారత్‌ ఒలింపిక్‌ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. 2022 ఆసియా గేమ్స్‌లో కూడా స్వర్ణం సాధించాడు. 2023 బాకులో జరిగిన ప్రపంచకప్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత టీమ్‌లో 2 రజత పతకాలతో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. 2022లో ప్రపంచ ఛాంపియిన్‌షిప్‌లో టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్‌ ఈవెంట్‌ లో స్వర్ణం సాధించగా.. తాజాగా ఒలింపిక్స్‌ కాంస్య పతకం సాధించాడు.

చరిత్ర సృష్టించిన మనుబాకర్‌..
ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్‌ మనుబాకర్‌ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మహిళగా, షూటింగ్‌లో పతకం సాధించిన మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీం విభాగంలో మనిక బత్రా–షరబ్‌ జ్యోతి సింగ్‌ కొరియాతో తలపడి కాంస్యం సాధించారు. మను బాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ద్వయం (లీ–యెజిన్‌) 10 పాయింట్లు సాధించింది. మను ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. భారతదేశం బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్‌–ఇండియన్‌ అథ్లెట్‌ నార్మన్‌ ప్రిచర్డ్‌ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించారు.
ఓకే అన్నా