Virat Kohli: అడుగడుగునా గోప్యత.. పిల్లలపై ఆప్యాయత.. విరాట్ అనుష్క చెబుతున్న పేరెంటింగ్ పాఠాలు ఏంటంటే..

సాధారణంగా సెలబ్రిటీలు తమ జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. కానీ విరాట్ అనుష్క దంపతులు అందుకు పూర్తి విరుద్ధం. వారు వారు చేస్తున్న పనులకు సంబంధించి ఫోటోలు పోస్ట్ చేస్తారు తప్ప.. పిల్లలకు సంబంధించిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటి ప్రపంచానికి చూపించరు.

Written By: Suresh, Updated On : February 22, 2024 7:00 pm
Follow us on

Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఒకరేమో ప్రపంచం మెచ్చిన క్రికెటర్.. మరొకరేమో బాలీవుడ్ లో విలక్షణమైన యాక్టర్. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 2017 లో ఒక్కటయ్యారు. 2021 లో వామిక అనే కూతురుకు జన్మనిచ్చారు. వాస్తవానికి మొదటిసారి తాము తల్లిదండ్రులవుతున్నామనే విషయాన్ని అనుష్క, విరాట్ ఎక్కడా చెప్పలేదు. అనుష్క గర్భం దాల్చిన నాటి నుంచి వామిక అనే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చేంత వరకు విరాట్ గోప్యత పాటించాడు. తనకు కూతురు పుట్టింది అని చెప్పి విరాట్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. ఇప్పటివరకు తన కూతురి ముఖాన్ని బయట ప్రపంచానికి విరాట్ చూపించలేదు. తన కూతురి పేరు వామిక అని మాత్రమే బయటపెట్టాడు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం.

సాధారణంగా సెలబ్రిటీలు తమ జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. కానీ విరాట్ అనుష్క దంపతులు అందుకు పూర్తి విరుద్ధం. వారు వారు చేస్తున్న పనులకు సంబంధించి ఫోటోలు పోస్ట్ చేస్తారు తప్ప.. పిల్లలకు సంబంధించిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటి ప్రపంచానికి చూపించరు. ఒకవేళ చూపించాల్సి వచ్చినప్పుడు వారి ముఖాన్ని డ్రాగ్ చేస్తారు.. పేరేటింగ్ విషయంలో తగువులు పెట్టుకోకుండా.. సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.. ముఖ్యంగా వామిక విషయంలో విరాట్, అనుష్క ఎంతో బాధ్యతగా ఉంటారు. కెరియర్ దృష్ట్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పటికీ.. తమ కూతురు వామికకు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను అనుష్క, విరాట్ దూరం చేయలేదు. వారి సమక్షంలోనే తమ కూతురు వామికా ను పెంచుతున్నారు. కెమెరా కంటికి, స్టార్ కిడ్ కల్చర్ కు తమ కూతుర్ని దూరంగా పెంచుతున్నారు.. ఇలాంటి చర్యల వల్ల పిల్లల్లో సహజ లక్షణాలు బయటికి వస్తాయని గతంలో విరాట్ చెప్పకనే చెప్పాడు.

వరల్డ్ కప్ ముందు అనుష్క రెండవ సారి గర్భం దాల్చినప్పుడు విరాట్ ఆకస్మాత్తుగా ముంబై వెళ్ళిపోయాడు. ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షలు దగ్గరుండి చూసుకున్నాడు. చివరికి ఆమె ప్రసవించే సమయానికి కీలకమైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. విరాట్ కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తన భార్య ఫిబ్రవరి 15న ప్రసవిస్తే.. ఫిబ్రవరి 20న సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి విరాట్ చెప్పాడు. తన కొడుకు పేరు అకాయ్ అని పెట్టినట్టు వివరించాడు. అకాయ్ అంటే టర్కీష్ భాషలో పరిపూర్ణమైన చంద్రుడని అర్థం. తనకు కొడుకు పుట్టినప్పటికీ అతడి ముఖాన్ని గాని.. ఇంకే విషయాన్ని గానీ విరాట్ బయటి ప్రపంచానికి చెప్పలేదు. అన్నిటికంటే ముఖ్యంగా సెలబ్రిటీ కుటుంబాల్లో నాని కల్చర్ ఇటీవల పెరిగిపోయింది. ఒక బేబీ సిట్టర్ ద్వారా పిల్లల పెంపకాన్ని పర్యవేక్షించడం ఈ నాని కల్చర్ ముఖ్య ఉద్దేశం. కానీ తమ పిల్లలకు స్వయంగా ప్రేమను పంచుతూ.. నానీ కల్చర్ కు విరాట్ అనుష్క దంపతులు దూరంగా ఉంచుతున్నారు. దీనివల్ల పిల్లల అవసరాలు తల్లిదండ్రులకు త్వరగా తెలుస్తాయి. వారి మధ్య బంధం కూడా దృఢమవుతుంది. విరాట్ అనుష్క దంపతులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కూడా తమ కూతురిని తీసుకెళ్తుంటారు. చివరికి గుడికి కూడా. గుడికి తీసుకెళ్లడం వల్ల పిల్లల్లో సానుకూల దృక్పథం పెరుగుతుందని విరాట్, అనుష్క నమ్మకం. వృత్తి గత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూనే.. వ్యక్తిగత జీవితాన్ని ఈ స్టార్ కపుల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈతరం తల్లిదండ్రులకు పేరెంటింగ్ పాఠాలు చెబుతున్నారు.