Virat Kohli: కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ అనిల్ అక్కడ లేకుండా ఆడుతున్నాడు. గడచిన ఆరు నెలల్లో అతని ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. పెర్త్ టెస్ట్ మినహా.. మిగతా అన్నింటిలో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో అతని ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో అతడిని జట్టు నుంచి కూడా తొలగించాలని డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. కేవలం విరాట్ మాత్రమే కాకుండా, సీనియర్ ఆటగాళ్లు కూడా విఫలం కావడంతో టీమిండియా ఇటీవలి కాలంలో టెస్ట్ క్రికెట్లో దారుణమైన ఓటములను మూటగటుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో ఆటగాళ్లు మొత్తం రంజి ఆడాలని బీసీసీఐ సూచించడంతో.. సీనియర్ ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ బాటపట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. గిల్ కూడా అదే జట్టు తరఫున బరిలోకి దిగాడు. కింగ్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున రంగంలోకి దిగాడు. అయితే గత మ్యాచ్లో మెడ నొప్పి తీవ్రంగా బాధించడంతో అతడు రంగంలోకి దిగలేదు. ఇక గురువారం నుంచి ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్ మొదలైంది. దీంతో విరాట్ ఢిల్లీ జట్టు తరుపున రంగంలోకి దిగాడు. దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత అతడు డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
పోటెత్తిన ఫ్యాన్స్
ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా అభిమానులకు ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించడంతో.. భారీగా మైదానానికి తరలివచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే వారు ఎదురుచూడడం మొదలుపెట్టారు. కోహ్లీ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నప్పటికీ.. అభిమానులు తమ ప్రేమను ఏమాత్రం అతడిపై తగ్గించుకోలేదు. ఈ మ్యాచ్ ద్వారా అది నిరూపితమైందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీగా ప్రేక్షకులు రావడంతో అరుణ్ జైట్లీ మైదానం మొత్తం కిక్కిరిసిపోయింది. స్టేడియం బయట క్యూ లైన్ రెండు కిలోమీటర్ల మేర దాటింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు అభిమానులు విరాట్ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. వి సపోర్ట్ ఆర్సిబి అంటూ నినందించారు. ఐ లవ్ యు విరాట్ కోహ్లీ అంటూ ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రంగంలోకి దిగడంతో.. ముందుగా లైవ్ ఇవ్వడానికి జియో సినిమా అంతగా ఆసక్తి చూపించలేదు. ఎప్పుడైతే కోహ్లీ ఆడుతున్నాడని తెలిసిందో.. అప్పుడే జియో సినిమా లైవ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే కోహ్లీ ఆడుతుండగా.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకు వెళ్ళాడు. కోహ్లీ కాళ్ల మీద పడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని విరాట్ కోహ్లీ వారించాడు. భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన మ్యాచ్ కు కొంతసేపు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత మ్యాచ్ యధావిధిగా మొదలైంది.
Unreal craze for King Kohli.#ViratKohli #kohli #vk #virat #cricket #CricketTwitter #cricketfans #cricketlover #cricketnation #CricketUpdates #cricketnews #arunjaitleystadium pic.twitter.com/GHVZf7C5ii
— KOTH Gaming (@KOTHGaming_) January 30, 2025