SL Vs AUS: ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా 290 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఖవాజా కెరియర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కు 147 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సంవత్సరం చరిత్రలో ఏ ఆస్ట్రేలియా ఆటగాడు కూడా శ్రీలంక గడ్డపై డబ్బులు సెంచరీ సాధించలేదు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జస్టిన్ లాంగర్ 166 రన్స్ చేశాడు. ఇప్పటివరకు ఇది హైయెస్ట్ స్కోర్. అయితే అతడి రికార్డును ఖవాజా బ్రేక్ చేశాడు. శ్రీలంక గడ్డపై హైయెస్ట్ రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల జాబితాలో ఉస్మాన్ ఖవాజా తొలి స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత జస్టిన్ లాంగర్ 166, డామియన్ మార్టిన్ 161, లేహ్ మన్ 153, స్టివ్ స్మిత్ 145 పరుగులతో కొనసాగుతున్నారు.. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖవాజాకు స్టీవ్ స్మిత్ (141) తోడయ్యాడు. జోష్ ఇంగ్లీస్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 527 పరుగుల భారీ స్కోరు చేసింది.. ఇక ఈ మ్యాచ్లో స్మిత్ కూడా 35వ సెంచరీ నమోదు చేయడంతో.. పదివేల పరుగుల మైలురాయి అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.. ఈ క్రమంలో అనేక రికార్డులను అతడు బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా తరఫున 35 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ కంటే ముందు రికీ పాంటింగ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్లో పదివేల పరుగుల మైలవై అందుకున్న నాలుగవ ఆస్ట్రేలియా బ్యాటర్ గా, 15వ అంతర్జాతీయ క్రికెటర్ గా సమితి కొనసాగుతున్నాడు.
గడచిన 14 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకోలేదు. అయితే ఈసారి దానికి చెక్ పెట్టాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరుకుంది. భారత జట్టును బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడించి ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లిపోయింది. అయితే ఇదే ఊపును శ్రీలంకపై కూడా కొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే ఈ సిరీస్ కు కమిన్స్ దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ జట్టును నడిపిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే శ్రీలంక బౌలర్లు.. సొంత మైదానంపై తేలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఉపఖండ మైదానాలపై ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. అందువల్లే ఆ స్థాయిలో భారీ స్కోర్ చేయగలిగారు.
USMAN KHAWAJA DOUBLE CENTURY
It’s the first of his Test career and the first ever by an Australian in Sri Lanka! pic.twitter.com/6rd10XfKfe
— 7Cricket (@7Cricket) January 30, 2025