https://oktelugu.com/

Paralympics: భారత్ కు మరో స్వర్ణం అందించిన కృష్ణసాగర్.. మొత్తం 19..

Paralympics: Krishnasagar brings another gold to India : పారాలింపిక్స్ లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. ఒలింపిక్స్ లో పెద్దగా దక్కని పతకాలను పారా ఒలింపిక్స్ లో మన వికలాంగ క్రీడాకారులు అందిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ ఉదయం యతిరాజ్ వల్ల టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్ లో సుహాస్ యుతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ ఎల్ 4 విభాగం ఫైనల్స్ లో […]

Written By: , Updated On : September 5, 2021 / 11:41 AM IST
Follow us on

Paralympics: Krishnasagar brings another gold to India : పారాలింపిక్స్ లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. ఒలింపిక్స్ లో పెద్దగా దక్కని పతకాలను పారా ఒలింపిక్స్ లో మన వికలాంగ క్రీడాకారులు అందిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ ఉదయం యతిరాజ్ వల్ల టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది.
బ్యాడ్మింటన్ లో సుహాస్ యుతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ ఎల్ 4 విభాగం ఫైనల్స్ లో ప్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది.

ఇక కొద్దిసేపటి క్రితమే భారత్ కు ఏకంగా బంగారు పతకాన్ని అందించాడు షట్లర్ కృష్ణసాగర్. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్6లో కృష్ణ సాగర్ స్వర్ణం గెలుచుకున్నాడు. ఫైనల్లో హాంకాంగ్ ఆటగాడు కైమన్ చూపై కృష్ణ విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఈరోజు ఇప్పటికే భారత్ కు రెండు పతకాలు వచ్చాయి.

ఉదయం యతిరాజ్ రజతం సాధించగా.. తాజాగా కృష్ణ స్వర్ణం సాధించి భారత్ సత్తా చాటాడు. దీంతో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కు చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు , 6 కాంస్యాలు ఉన్నాయి.