Pakistan national anthem blunder: పాకిస్తాన్ ఏ ముహూర్తాన భారత జట్టుతో తలపడాలి అనుకుందో.. అప్పటినుంచి వరుసగా అపశకునాలు ఎదురవుతున్నాయి. ఈ ఒక్కటీ కలిసి రావడం లేదు. అనుకున్నది నెరవేరడం లేదు. చివరికి అవమానాలు.. వరుస దారుణాలు ఆ జట్టుకు ఎదురవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ జట్టుకు ఏదైనా ఒక అనుభవం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణమవుతోంది.
అంతర్జాతీయ టోర్నీలలో మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు జాతీయ గీతాలు ఆలపించడం సర్వసాధారణం. దీనివల్ల ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి మరింత పెరుగుతుందని ఐసిసి భావించి ఈ విధానానికి గత కొంతకాలంగా శ్రీకారం చుట్టింది. దీనికి అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఐసీసీ తీసుకొచ్చిన ఈ విధానం పాకిస్తాన్ జట్టుకు ఆదివారం దారుణమైన అవమానాన్ని మిగిలించింది. చివరికి ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ ఆటగాళ్లు తలలు పట్టుకున్నారు. మైదానంలో కొద్ది సెకండ్ల పాటు చోటు చేసుకున్న ఈ సంఘటన పెను సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ జాతీయ గీతానికి బదులుగా జలేబీ బేబీ అనే పాప్ గీతాన్ని డీజే ప్లే చేశాడు. ఆరు సెకండ్ల పాటు ఈ గీతం ప్లే అయింది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి జాతీయ గీతానికి బదులుగా ఈ పాట ప్లే చేస్తున్నారంటూ అలా చూస్తూ ఉండిపోయారు. జరిగిన నష్టానికి గుర్తించిన డీజే వెంటనే ఆ పాటను నిలుపుదల చేసి.. పాకిస్తాన్ జాతీయ గీతాన్ని ప్లే చేశాడు.
పాకిస్తాన్ జాతీయ గీతం ప్లే కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఐసీసీ జాతీయ గీతాల ఆలాపన విధానాన్ని తీసుకువచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఇటువంటి తప్పిదం జరగలేదు. తొలిసారి ఈ ఘటన జరగడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు అంటే చివరికి డీజే కి కూడా లెక్కలేకుండా పోయిందని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.. చివరికి జాతీయ గీతాన్ని కూడా సక్రమంగా ప్లే చేసుకోలేని స్థితిలో పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
DJ played Jalebi Baby song on Pakistan National anthem #INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI
— (@ImHvardhan21) September 14, 2025