Pakistan Vs India: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై ఉత్కంఠప్ప పరిస్థితుల మధ్య విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి భారత్ విజయం సాధించింది. భారత్ సాధించిన విజయంలో కులదీప్ యాదవ్, తిలక్ వర్మ కీలక భూమికలు పోషించారు. బౌలింగ్లో కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్లో తిలక్ వర్మ ఏకంగా హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. వీరిద్దరి కలయిక టీమిండియా కు అద్భుతమైన గెలుపును అందించింది.
టీమిండియా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో అప్పటికే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సంజు, తిలక్ వర్మ నాలుగో వికెట్ కు ఏకంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ జోడి అత్యంత ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ సంజు ను అవుట్ చేశాడు. అబ్రార్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టడానికి సంజు ప్రయత్నించాడు. ఈ దశలో బంతి బ్యాట్ చివరి అంచుకు తాకి గాలిలో లేచింది. దీంతో ఎటువంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ ప్లేయర్ ఆ బంతిని అందుకున్నాడు. సంజు ఔట్ అయిన తర్వాత భారత శిబిరంలో నిరాశ నెలకొంది. ఈ దేశంలో అబ్రార్ అహ్మద్ మెడలు వంచుతూ వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. గతంలో కూడా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ గిల్ ను ఔట్ చేసి.. అలానే సంకేతాలు ఇచ్చాడు.
అబ్రార్ అహ్మద్ అలా మెడలు వంచి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం టీం ఇండియా ప్లేయర్లు సరికొత్తగా కౌంటర్ ఇచ్చారు. ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయర్లు మెడలు వచ్చి వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుగా అబ్రార్ అహ్మద్ కు సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు తమ జోలికి వస్తే ఇలానే ఉంటుందని హెచ్చరికలు పంపించారు. టీమిండియా ప్లేయర్లు అలా మెడలు వంచుతూ ర్యాగింగ్ చేస్తున్న దృశ్యాన్ని సంజు శాంసన్ దగ్గరుండి చూశాడు. వామ్మో మా వాళ్లతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ హావభావాలు ప్రదర్శించాడు.
INDIAN PLAYERS DOING ABRAR CELEBRATION…!!! pic.twitter.com/3trZCTzGmr
— Johns. (@CricCrazyJohns) September 28, 2025