Pakistan Vs India: అదేం దరిద్రమో గాని.. పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ నుంచి మొదలు పెడితే ప్లేయర్ల వరకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారో.. ఎందుకు అలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు ఎంతకీ అంతుపట్టదు. మేనేజ్మెంట్ కు బుద్ధి లేదు. కెప్టెన్ కు తలకాయ లేదు. ప్లేయర్లకు కనీస జ్ఞానం లేదు. అందువల్లే పాకిస్తాన్ జట్టుకు ఆసియా కప్ లో ఒక విజయం కూడా టీమిండియా పై దక్కలేదు. వాస్తవానికి ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. ఒక ఓటమి నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాలి. ఆ ఓటమి ఎందుకు ఎదురయిందో గుర్తించాలి. గెలవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. కానీ ఇవేవీ పాకిస్తాన్ జట్టుకు చేతకాలేదు. అందువల్లే మూడోసారి కూడా టీమిండియా నుంచి ఓటమి తప్పలేదు.
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్ కు ఏకంగా 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు దుమ్మురేపడంతో పాకిస్తాన్ జట్టు పని అయిపోయింది. బ్యాటర్లు నిలబడలేకపోయారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తం కుప్పకూలిపోయింది. ఫలితంగా పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియా ముందు నామమాత్రపు స్కోరును ఉంచింది..
ఈ స్కోరును చేదించే క్రమంలో టీమిండియా ఇబ్బంది పడినప్పటికీ.. అంతిమంగా మాత్రం టార్గెట్ ఫినిష్ చేసింది. తద్వారా తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకొని అదరగొట్టింది. విజయం తర్వాత టీమిండియా ట్రోఫీ అందుకోలేదు. పాకిస్తాన్ జట్టు అధ్యక్షుడి నుంచి ప్రోఫీ అందుకోవడం ఇష్టం లేక టీమ్ ఇండియా ప్లేయర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా రన్నర్ అప్ క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. కానీ మూడు ఓటముల నిర్వేదం.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన బాధతో.. క్యాష్ ప్రైజ్ ను నేలకు విసిరి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఆట తీరుతో ఆకట్టుకోవాల్సిన పాకిస్తాన్ కెప్టెన్.. ఇలా తన కోపాన్ని ప్రదర్శించడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆట ద్వారా అదరగొట్టాల్సిన వేళ.. ఇలా చెక్ విసిరి కొడితే ఉపయోగం ఏముంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Drama Alert!
After losing to India THREE times, Salman Agha’s patience has snapped “Popatwadi Captain!”pic.twitter.com/eIlt0RVdWx— Sporttify (@sporttify) September 29, 2025