https://oktelugu.com/

Pakistan Super League : వీడియో: మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగాడు.. అడ్డంగా దొరికిపోయాడు.. క్రికెటర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం

ఈ ఘటన పాకిస్తాన్ దేశంలో పెద్ద వివాదానికి కారణమైంది. మ్యాచ్ జరుగుతుండగానే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఇస్లామాబాద్ ఆటగాడు సి*** తాగడాన్ని అక్కడి అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మ్యాచ్ మధ్యలో అలా పొగతాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ ఆడుతున్న సెలబ్రిటీ అనే సోయి కూడా అతడికి లేదా అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. ముల్తాన్ జట్టుపై ఇస్లామాబాద్ జట్టు చివరి బంతికి విజయం సాధించింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 10:12 PM IST

    Pakistan Super League

    Follow us on

    Pakistan Super League : సామాన్యులను పక్కన పెడితే.. క్రికెటర్ల వంటి సెలబ్రిటీలకు సొసైటీ మీద బాధ్యత ఉండాలి. క్రికెటర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి.. వారు చేసే ప్రతి పనిని అభిమానులు నిషితంగా పరిశీలిస్తుంటారు. అప్పట్లో ధోని జులపాల జుట్టు చాలా ఫేమస్. అలాంటి జుట్టును చాలామంది పెంచారు. యువరాజ్ సింగ్ ఆర్మీ కటింగ్ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. దాన్ని చాలామంది యువకులు ఫాలో అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. అందుకే క్రికెటర్ల లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లైఫ్ లో జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏమాత్రం తేడా కొట్టిన ఇదిగో ఈ క్రికెటర్ లాగా అభాసు పాలవుతారు.

    పాకిస్తాన్ దేశంలో ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరిట టి20 టోర్నీ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో డ్రెస్సింగ్ రూమ్ లో ఓ క్రికెటర్ సి*** తాగుతూ కెమెరాకు చిక్కాడు. దీంతో అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్ జట్లు తలపడ్డాయి. ముల్తాన్ జట్టును రెండు వికెట్ల తేడాతో ఓడించి ఇస్లామాబాద్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇస్లామాబాద్ జట్టుకు ఇది మూడవ పాకిస్తాన్ సూపర్ లీగ్ ట్రోఫీ. ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్ 17.4 ఓవర్ వద్ద క్రికెట్ చరిత్రలో కనివిని ఎరుగని ఘటన చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ బౌలర్ నఫిమ్ షా బౌలింగ్ చేస్తుండగా అప్పటికే 5 వికెట్లు పడగొట్టిన ఇమద్ వసీం ఆకస్మాత్తుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. అందులో సి*** ముట్టించాడు. అంతకుముందే ఐదు వికెట్లు తీసిన ఉత్సాహమో, లేక ఆటలో ఒత్తిడో తెలియదు గాని అతడు దమ్ములాగాడు.