Pakistan Cricket Board Chairman Naqvi: ఏదైనా విషయం చెబితే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదు. అదేం దరిద్రమో తెలియదు గాని.. పాకిస్తాన్ పాలకులు ఏం చెప్పినా నమ్మే విధంగా ఉండదు. చివరికి పాకిస్తాన్ క్రికెటర్లు చెప్పేది కూడా అదే విధంగా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ మీద పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనా వేసుకున్నట్టుగా ప్రేక్షకులు రావడం లేదు. ఎందుకంటే అక్కడ లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనికి తోడు కేవలం రెండు వేదికలలో మాత్రమే అక్కడ మ్యాచులు నిర్వహిస్తున్నారు. లీగ్ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ లో మైదానం ఖాళీగా కనిపించింది. ప్రేక్షకులు ఆకపోవడంతో స్టాండ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత చర్చ మొదలైంది. ఐపీఎల్ కంటే ఎక్కువ విలువ ఉందని.. అంతకు మించిన స్థాయిలో పేరు తెచ్చుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు గొప్పగా చెప్పారు. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ విపరీతంగా విమర్శలు మొదలుపెట్టారు. మెన్ అఫ్ ది మ్యాచ్ అవార్డుకు నూనె సీసాలు.. మేకపోతులను బహుమతిగా ఇచ్చే వాళ్ళు కూడా ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నారంటూ హేళన చేశారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఖాళీ మైదానాలు కనిపించడం వెనక ఒక ఆసక్తికరమైన కారణం ఉందని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ కారణం ఎలా ఉందంటే.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడిదిరా రెస్పాన్సిబిలిటీ అని అడిగేలా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నక్వి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఏ స్థాయిలో అంటే.. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని నిలుపుదల చేయడంలో.. సీజ్ ఫైర్ తెరపైకి రావడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారట. అందువల్లే ఇరాన్, అమెరికా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపి వేశాయట. నక్వి బిజీగా ఉండడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ లీగ్ మీద దృష్టి పెట్టలేకపోయారట. కాల్పుల విరమణ చర్చల్లో ఆయన ప్రమేయం ఉందట.. అందువల్లే పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదట..
“పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శాంతి చర్చల్లో బిజీగా ఉన్నారు. ప్రపంచానికి శాంతి అందించడంలో ఆయన తాపత్రయ పడుతున్నారు. వినోదాన్ని దూరం పెట్టారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు కూడా అదే కోరుకున్నాడు.. దానిని నక్వి అమలులో పెట్టాడు.. ఇతర లీగ్ లతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ను పోల్చకూడదు.. అది సరైన విధానం కాదని” ట్విట్టర్లో పాకిస్తాన్ దేశానికి చెందిన అలీ నక్వీ వ్యాఖ్యానించాడు.
అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోష ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఇండియన్ అభిమానులు అతని ట్వీట్ ను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు..
Dear @thePSLt20 fans,
The latest announcements on the Iran ceasefire and Pakistan’s pivotal role in it finally explain why crowds were not allowed in the stadiums this season.
Not hosting matches in Pindi makes complete sense — Islamabad was clearly the chosen venue for…— Ali Naqvi (@AliNaqvi808) April 8, 2026