https://oktelugu.com/

AUS VS PAK T20 Match : ఆస్ట్రేలియాతో మ్యాచ్.. నడి స్టేడియంలో చెడ్డి జారిపోయింది.. పాకిస్తాన్ ప్లేయర్ పరువు పోయింది

ఆస్ట్రేలియా జట్టుతో ఇటీవల వన్డే సిరీస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు.. టి20 సిరీస్ లో మాత్రం దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. మూడు టి20 మ్యాచ్లో సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయింది. హోబర్ట్ లో జరిగిన మూడవ టి20 లోనూ పాకిస్తాన్ ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 03:14 PM IST

    Jahandad

    Follow us on

    AUS VS PAK T20 Match :  మూడవ టి20 లో పాకిస్తాన్ జట్టు తరుపున జహందాద్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇతడి విషయంలో జరిగిన ఓ సంఘటన సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా బంతి కోసం పాకిస్తాన్ ఆటగాడు జహందాద్ పరిగెత్తాడు. ఆ సమయంలో అతడి ప్యాంట్ జారిపోయింది. అయితే అతడు జారిపోతున్న తన ప్యాంటును సర్దుకోవడంతో బంతి అలా వెళ్ళిపోయింది.. దీంతో లైవ్ మ్యాచ్ వస్తున్న వారు పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వారు.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్లో షాహిన్ ఆఫ్రిది బంతి వేయగా.. అది వేగంగా బౌండరీ లైన్ దాటింది. ఈ క్రమంలో జహందాద్ బౌండరీ గీత వేపు పరుగులు పెట్టాడు. అతడు మెరుపు వేగంతో డైవ్ చేసినప్పటికీ బంతి బౌండరీ గీతను దాటేసింది. అతడు మైదానంలో డైవ్ చేస్తుండగా జహందాద్ ప్యాంట్ ఒక్కసారిగా కిందకు అలా జారిపోయింది. ఆ తర్వాత అతడు బంతిని పట్టుకోకుండా.. తన ప్యాంటును పైకి లాక్కున్నాడు. అయితే తన వేసుకున్న జెర్సీకి సంబంధించిన ప్యాంటును సరిగ్గా కట్టుకోకపోవడంతోనే ఇలాంటి షాక్ తగిలిందని తెలుస్తోంది.. ప్యాంటును సర్దుకున్న తర్వాత జహందాద్ బంతిని అందుకున్నాడు. ఆ మరుసటి ఓవర్ లో అతడు బౌలింగ్ చేశాడు.. ఆడుతోంది మొదటి మ్యాచ్ అయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ వేసాడు. మూడవ వలలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తన తొలి అంతర్జాతీయ టి20 క్రికెట్ లో మగార్క్ ను అవుట్ చేసి తొలి వికెట్ ను దక్కించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో షాహిన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్ దారుణంగా విఫలమయ్యారు. మరోవైపు జహందాద్ ఓవర్ కు 5.70 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

    దారుణమైన ఓటమి

    ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ధాటిగా ఆడలేకపోయింది. ఆస్ట్రేలియా ఎదుట భారీ లక్ష్యాన్ని విధించడంలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కేవలం 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బాబర్ ఆజాం 41 పరుగులు చేశాడు. ఇతర ఆటగాళ్లు రాణించలేకపోవడంతో పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని 11.2 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ పాకిస్తాన్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దంచి కొడుతుంటే ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మూడో టి20లో ఆస్ట్రేలియా కొంతమంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లతో రంగంలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్ ను గెలవాల్సిన పాకిస్తాన్.. మొదటి రెండు మ్యాచ్ల మాదిరిగానే చేతులెత్తేసింది. బ్యాటింగ్ లో విఫలమైంది. బౌలింగ్లో నిరాశ జనకమైన ప్రదర్శన చేసింది. ఫలితంగా వరుసగా మూడో టి20లో ఓడిపోయి పరువు తీసుకుంది.. టి20 సిరీస్ కంటే ముందు మూడు వన్డేల సిరీస్ పాకిస్తాన్ ఆడింది. పాకిస్తాన్ ఎన్నడూ లేనివిధంగా ఆట తీరు ప్రదర్శించింది. ఆస్ట్రేలియాపై పుష్కరం తర్వాత వన్డే సిరీస్ దక్కించుకుంది. కానీ అదే జోరు టి20 సిరీస్ లో కొనసాగించలేకపోయింది. వైట్ వాష్ కు గురై.. పరువు తీసుకుంది.