https://oktelugu.com/

Ram Gopal Varma : నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది: హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ సంచలన బెయిల్ పిటిషన్

భారతీయ చిత్ర పరిశ్రమలో రాంగోపాల్ వర్మది ప్రత్యేక స్థానం. అన్ని భాషల్లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లో చిక్కుకున్నారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది.

Written By: Dharma, Updated On : November 20, 2024 3:19 pm
Ram Gopal Varma

Ram Gopal Varma

Follow us on

Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోర్టు కేసుల్లో నిండా మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.వైసిపి హయాంలో సోషల్ మీడియాలో వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకాశం జిల్లాలో టిడిపి నేత ఒకరు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి వర్మ కు నోటీసులు అందించారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే తాను విచారణకు హాజరు కాలేనని చెబుతూ పోలీసులకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించారు వర్మ. అంతకుముందే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు దానిని కొట్టేసింది. అరెస్టును నియంత్రించలేమని తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ తరుణంలో ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవకాశం ఉందని.. అందుకే ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ రాంగోపాల్ వర్మ పిటిషన్ లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.ఎన్నికల్లో కూటమి గెలవడంతో తనను టార్గెట్ చేస్తారని వర్మకు తెలుసు. అందుకే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెట్టిన పోస్టులను డిలీట్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా టిడిపి నేత ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు విచారణకు పిలిచారు.

* వాట్సాప్ ద్వారా సమాచారం
అయితే పోలీస్ విచారణకు హాజరు కాని వర్మ.. పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడం విశేషం. తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని.. తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తిలో కోరారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్న వర్మ.. తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని తన బెయిల్ పిటిషన్ లో తెలిపారు. ఈ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా తన పోస్టులు పెట్టలేదని చెప్పుకొచ్చారు.

* కోర్టుకు విన్నపం
అయితే వర్మ ఏకంగా తనపై విచారణలో దాడి జరుగుతుందని.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని పేర్కొనడం సంచలనంగా మారింది. అందుకే తనకు ముందు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. క్వాష్ పిటిషన్ రద్దు చేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వర్మ. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.