https://oktelugu.com/

పాకిస్తాన్ ఒలింపిక్స్ దుస్థితికి నిదర్శనమిదీ

టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు మొదలయ్యాయి. వివిధ దేశాల నుంచి క్రీడాకారులు రావడంతో ఆటల సంరంభం నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది క్రీడాకారులే పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. 2012లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు 2021లో పాల్గొన్న అథ్లెట్లు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. దీంతో అప్పటికి ఇప్పటికి ఎంత దారుణంగా మారింది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 22 […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 25, 2021 / 05:32 PM IST
    Follow us on

    టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు మొదలయ్యాయి. వివిధ దేశాల నుంచి క్రీడాకారులు రావడంతో ఆటల సంరంభం నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది క్రీడాకారులే పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. 2012లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు 2021లో పాల్గొన్న అథ్లెట్లు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. దీంతో అప్పటికి ఇప్పటికి ఎంత దారుణంగా మారింది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

    22 కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి టోక్యో ఒలింపిక్స్ 2021కి 10 మంది ఆటగాళ్లే ఆతిథ్యమివ్వడం విచారకరం. క్రీడల్లో పాకిస్తాన్ దిగజారిపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. దేశంలో ప్రతిభకు కొదవ లేకున్నా క్రీడాకారుల ఎంపికలో రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఇంత తక్కువ మంది ఒలింపిక్స్ కు వెళ్లడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న క్రీడాకారుల వివరాలు అందిస్తే సహకారం అందజేస్తామని చెప్పారు.

    2012 ఒలింపిక్స్ లో పాకిస్తాన్ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 1956 మెల్ బోర్న్ ఒలింపిక్స్ లో అత్యధికంగా 62 మంది అర్హత సాధించారు. పాక్ ఖాతాలో ఇప్పటివరకు 10 పతకాలు ఉన్నాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ తరువాత పాక్ ఒక్క పతకం కూడా గెలవలేదు. పాకిస్తాన్ పురుషుల హాకీ టీం సాధించిన కాంస్యమే పాక్ ముద్దాడిన చివరి ఒలింపిక్ పతకం. దాదాపు 30 సంవత్సరాలుగా పాక్ పతకం గెలవలేదు. ఈ సారి కూడా ఆశలు లేవు.

    టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలో పాక్ తరఫున వెళ్లిన వారి వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. పాక్ దేశ జెండాను చూపుతూ వెనుక అథ్లెట్లు నడుస్తున్న సమయంలో వారిలో పలువురు మాస్కులు ధరించారు. కానీ మాస్కును ముక్కుకు కాకుండా గడ్డానికి పెట్టుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. టోక్యోలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంల పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ దుస్థితిపై మాజీ క్రికెటర్ ఇమ్రాన్