Smriti Mandhana Marriage Cancelled: భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్స్ స్మృతి మందాన వివాహం రద్దయింది. సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఆమె ఈ ప్రకటన చేసింది. దీంతో ఇన్ని రోజులుగా సాగిన ఉత్కంఠకు తెర పడింది. స్మృతి, పలాష్ ముచ్చల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
మహారాష్ట్రలోని సాంగ్లీలో వివాహం చేసుకోవడానికి ఘనంగా వేదికను సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో ఇద్దరి ముందస్తు వివాహ క్రతువుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సంచలనం సృష్టించాయి. ఈ వేడుకలో మహిళా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. వారంతా ఆ వీడియోలో విపరీతంగా సందడి చేశారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా.. స్మృతి తండ్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని అప్పటికప్పుడు అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది గంటల వ్యవధిలోనే స్మృతి భాయ్ ఫ్రెండ్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు.
ఈ ఘటనలు జరిగిన తర్వాత స్మృతి వివాహానికి సంబంధించి అనేక రకాల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానమైనది పలాష్ ముచ్చల్ కు మరో యువతీతో సంబంధం ఉందని.. దానికి సంబంధించి వాట్సాప్ లో చాట్ కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్ షాట్లు సర్కులేట్ అయ్యాయి.. అందువల్లే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని.. ఇకపై ఆమె అతడిని పెళ్లి చేసుకునే అవకాశం లేదని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దానికి బలం చేకూర్చుతూ స్మృతి ముందస్తు పెళ్లి వేడుక సంబంధించిన వీడియోలను, ఫోటోలను డిలీట్ చేసింది. మహిళా క్రికెటర్లు కూడా అదే పని చేశారు.. దీంతో పెళ్లి రద్దు పై అనేక రకాల ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వాటిపై స్మృతి అధికారికంగా నిన్నటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చివరికి ఆదివారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ కష్టకాలంలో తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని అభిమానులకు రిక్వెస్ట్ చేసింది.
పలాష్ ముచ్చల్ కు మరో యువతి తో సంబంధం ఉండడం వల్లే పెళ్లి క్యాన్సిల్ అయిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో యువతి తో సంబంధం కొనసాగిస్తూనే.. స్మృతి తో అతడు రిలేషన్ కొనసాగించాడని.. చివరికి వాట్సాప్ స్క్రీన్ షాట్ లు స్మృతి దగ్గరికి రావడంతో.. ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పెళ్లికి ముందే పలాష్ అసలు రంగు బయటపడటంతో స్మృతి తనను తాను రక్షించుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.