Pakistan FIFA Bid: అంతటి అమెరికా సొంతంగా నిర్వహించలేక మెక్సికో, కెనడాలో కలిసి సాకర్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. సాకర్ కప్ అంటే అంత ఈజీ కాదు. ఈ టోర్నీ నిర్వహించాలంటే భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. గత సీజన్లో ట్రోఫీ నిర్వహించిన ఖతార్ అప్పటికప్పుడు తాత్కాలికంగా మైదానాలు నిర్మించింది. భారీగా ఖర్చుపెట్టింది. తమ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. కేవలం సాకర్ కప్ ను దృష్టిలో పెట్టుకొని బీర్ల విక్రయాలు జరిపింది.
పెద్ద పెద్ద దేశాలే తట్టుకోలేకపోతుంటే.. ఫిఫా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుందట. తినడానికి తిండి లేదు గాని.. రోజు బిర్యానీ కావాలి అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ వ్యవహార శైలి. సాకర్ టోర్నీ నిర్వహించాలంటే ప్రపంచ స్థాయిలో మైదానాలు ఉండాలి. వందల కోట్ల బడ్జెట్ కావాలి.. అత్యంత ఆధునికమైన క్రీడా సామాగ్రి సమకూర్చాలి.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో సాకర్ కప్ నిర్వహించే అవకాశం దక్కదు.. కానీ ఫిఫా కప్ కు ఆతిధ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ కు అవకాశం ఉందట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబిల్ గబోల్.
పాకిస్తాన్ దేశంలో ఉన్న భౌగోళిక స్వరూపం ఫిఫా కప్ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందట. పాకిస్తాన్ దేశంలో కరాచీ నగరంలో ఉన్న లియారి అనే ప్రాంతంలో ఫుట్ బాల్ బాగా ఆడతారట. లియారి ప్రాంతంలో అద్భుతమైన మైదానం ఉందట.. అక్కడ ఫిఫా కప్ లో మ్యాచులు మొత్తం నిర్వహించవచట.. అయితే ప్రస్తుతం సాకర్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో లియారి ప్రాంతంలో వీధులు మొత్తం రంగురంగుల జెండాలతో కనిపిస్తున్నాయి. కలర్ఫుల్ డెకరేషన్స్ తో ఆకట్టుకుంటున్నాయి. భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు మ్యాచ్ లు లైవ్ చూస్తున్నారు.
స్థానిక ప్రాంతం మీద ఉన్న నమ్మకంతో గబోల్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలో సాకర్ టోర్నీ నిర్వహించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఆ స్థాయిలో మైదానాలు లేవు. ఒకవేళ పాకిస్తాన్ కిందా మీదా పడి నిర్వహించినప్పటికీ ఇక్కడ ఆడేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
