Homeక్రీడలుPakistan boycott: పాక్ బాయ్ కాట్.. వరల్డ్ కప్ లో మారిన సమీకరణాలు..సెమీస్ కు దాయాది...

Pakistan boycott: పాక్ బాయ్ కాట్.. వరల్డ్ కప్ లో మారిన సమీకరణాలు..సెమీస్ కు దాయాది కష్టమే

Pakistan boycott: త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడకూడదని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యం తో పాటు.. సంచలనం కూడా నమోదయింది.

పాకిస్తాన్ జట్టుకు టీమిండియా మీద చెప్పుకునే స్థాయిలో గొప్ప రికార్డు లేదు. ముఖ్యంగా ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలలో పాకిస్తాన్ జట్టు గొప్ప విజయాలు భారత జట్టు మీద సాధించలేకపోయింది. అందువల్లే పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని టీం ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు టీమిండియాతో పోటీ పడలేక ముందుగానే పాకిస్తాన్ జట్టు ఓటమిని ఒప్పుకుందని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం ఒకరకంగా ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మైదానంలోకి దిగకుండానే పాకిస్తాన్ జట్టు తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ కు రెండు పాయింట్లు లభించాయి. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు సెమిస్ వెళ్లే అవకాశాలు చాలా కృష్ణగా మారిపోయాయి.

ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఆడబోమని పాకిస్తాన్ చెప్పింది. దీంతో గ్రూప్ ఏ లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఐసీసీ నిబంధన ప్రకారం ఒక జట్టు మైదానంలోకి దిగడానికి ఒప్పుకోకపోతే ఆ మ్యాచ్ ను ఫోర్ ఫిట్ అని పిలుస్తారు. దీనివల్ల ప్రత్యర్థి జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు భారత్ కు మైదానంలోకి దిగకముందే రెండు పాయింట్లు లభించాయి. అంతేకాదు పాకిస్తాన్ జట్టు నెట్ రన్ రేట్ విషయంలో కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన ప్లేయింగ్ కండిషన్స్ బయటికి వస్తే పాకిస్తాన్ జట్టు పై ఏ స్థాయిలో ప్రభావం పడిందో క్లారిటీ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుత టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో గ్రూప్ ఏ లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, భారత జట్లు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సూపర్ 8 వరకు వెళ్తాయి. ఇక పాకిస్తాన్ జట్టు తీసుకున్న నిర్ణయం వల్ల భారత జట్టు ఖాతాలో రెండు పాయింట్లు నమోదు అయ్యాయి. అలాంటప్పుడు భారత్ తను ఆడే ప్రతి మ్యాచ్ లో ఒక గొప్పగా ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే స్వదేశంలో ఆడుతోంది కాబట్టి టీమ్ ఇండియాకు విపరీతమైన అడ్వాంటేజ్ ఉంటుంది.

పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ రద్దయింది కాబట్టి.. టీమిండియా మిగిలిన మూడు మ్యాచ్లలో ఒక్క గెలుపును అందుకున్నా సరే గ్రూపులో రెండో స్థానంలో ఉంటుంది. ఒకవేళ రెండు విజయాలు సాధిస్తే సూపర్ 8 వరకు వెళ్తుంది. అన్ని మ్యాచ్లలో విజయాలు సాధిస్తే టేబుల్ టాపర్ గా సూపర్ 8 వరకు వెళ్తుంది.

  • టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబై వేదికగా అమెరికాతో తలపడుతుంది.
  • ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడుతుంది.
  • ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్ జట్టుతో టీమిండియా పోటీపడుతుంది. అయితే ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసింది.
  • ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తన మూడు మ్యాచ్ ఆడుతుంది.

మరోవైపు పాకిస్తాన్ సూపర్ 8 కు వెళ్లాలంటే మూడు మ్యాచ్లు గెలవాలి. ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా నెదర్లాండ్స్, ఫిబ్రవరి 10న కొలంబో వేదికగా అమెరికా, ఫిబ్రవరి 18 కొలంబో వేదికగా నమీబియా జట్లతో పాకిస్తాన్ తలపడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ మూడు విజయాలు సాధిస్తే సూపర్ 8 కు వెళ్తుంది. అలా కాకుండా రెండు విజయాలు సాధిస్తే అప్పుడు పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటాయి. ఆ సమయంలో పాకిస్థాన్ నెట్ రన్ రేట్ ఆ జట్టు సూపర్ 8 భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిస్తే పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది .

త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ గా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ మీద టీం ఇండియా ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏమైనా రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా.. ఆ స్థాయిలో ఆడుతుందా.. అని అందరూ ఒక అంచనాలకు వచ్చారు. కానీ, పాకిస్తాన్ జట్టు పోటీ పడకుండానే చేతులెత్తేసింది. పాకిస్తాన్ భారత జట్టుతో మ్యాచ్ ఆడకుండా నిష్క్రమించడం వల్ల.. ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ యాజమాన్యానికి ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు. కానీ భారత జట్టుకు మాత్రం నూటికి నూరు శాతం లాభం. ఎందుకంటే మైదానంలో దిగక ముందే భారత్ రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular