Homeఅంతర్జాతీయంKhalistanis Canada: మనపై ఖలిస్తానీలను ఎగదోసి.. కెనడాకు ఇప్పుడు నొప్పి తెలుస్తోందీ..

Khalistanis Canada: మనపై ఖలిస్తానీలను ఎగదోసి.. కెనడాకు ఇప్పుడు నొప్పి తెలుస్తోందీ..

Khalistanis Canada: భారత్‌లోని ఖలిస్తానీ వేర్పాటు వాద ఉద్యమానికి కెనడా దశాబ్దాలుగా మద్దతు ఇస్తోంది. ఖలిస్తానీలకు మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక సస్టిన్‌ ట్రూడో కాలంలో అయితే ఖలిస్తానీలు మరింత రెచ్చిపోయారు. ట్రూడో ఖలిస్తానీలను విపరీతంగా ప్రోత్సహించారు. మంత్రి పదవులు ఇచ్చారు. వారు భారత్‌కు వచ్చి ప్రొటోకాల్‌లో ఉంటూ ఖలిస్తానీకి మద్దతుగా మాట్లాడారు. ఇందిరాగాంధీని చంపిన వారికి మద్దతు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఖలిస్తానీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి కెనడాకు ఇప్పుడు వేర్పాటువాద […]

Khalistanis Canada: భారత్‌లోని ఖలిస్తానీ వేర్పాటు వాద ఉద్యమానికి కెనడా దశాబ్దాలుగా మద్దతు ఇస్తోంది. ఖలిస్తానీలకు మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక సస్టిన్‌ ట్రూడో కాలంలో అయితే ఖలిస్తానీలు మరింత రెచ్చిపోయారు. ట్రూడో ఖలిస్తానీలను విపరీతంగా ప్రోత్సహించారు. మంత్రి పదవులు ఇచ్చారు. వారు భారత్‌కు వచ్చి ప్రొటోకాల్‌లో ఉంటూ ఖలిస్తానీకి మద్దతుగా మాట్లాడారు. ఇందిరాగాంధీని చంపిన వారికి మద్దతు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఖలిస్తానీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి కెనడాకు ఇప్పుడు వేర్పాటువాద సెగ తగిలింది. దీంతో గగ్గోలు పెడుతోంది. అన్యాయం, అక్రమం అని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అల్బర్టా వేర్పాటు ఉద్యమం
అల్బర్టా ప్రాస్పరిటీ ప్రాజెక్ట్‌ నాయకుడు మిచి సిల్వెస్టర్‌ కెంద్ర కెనడా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. 2026 మేలో రెఫరెండమ్‌ ప్లాన్‌తో 1.77 లక్షల సంతకాలు సేకరించాడు. పది లక్షల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘Wexit’ వాదనతో కెనడా నుంచి విడిపోవాలని ఉద్యమిస్తున్నాడు.

ట్రంప్‌తో రహస్య భేటీ..
సిల్వెస్టర్‌ ట్రంప్‌తో మూడుసార్లు రహస్యంగా భేటీ అయ్యారు. అల్బర్టాను ఎలా విడగొట్టవచ్చో చర్చించాడు. ఇక ట్రంప్‌కు కూడా అల్బర్టాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఎందుకంటే అక్కడ అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్‌ కెనడాను 51వ అమెరికా రాష్ట్రంగా కలుపుకుంటామని ప్రకటించాడు. 25% టారిఫ్‌లు విధించాడు. కెనడా నుంచి అమెరికా వెళ్లే విమానాలపై 10% సుంకాలు విధించాడు.

వేర్పాటు వాదంతో ఇబ్బందులు..
అధికార పార్టీ, గవర్నర్లు దీన్ని దేశద్రోహంగా చూస్తున్నారు. క్వెబెక్‌లో కూడా వేర్పాటు డిమాండ్లు ఉన్నాయి. కెనడా బలహీన స్వరంతో అమెరికాకు అభ్యంతరాలు చెబుతోంది. భారత్‌లోని వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన కెనడాకు ఇప్పుడు తనదాకా వచ్చేసరికి దేశద్రోహం, ప్రజాస్వామ్యానికి విఘాతం వంటి మాటలు గుర్తొస్తున్నాయి.

కెనడా స్వంత విభజన భయంతో ఆందోళనలో ఉంది. భారతానికి ఇది వేర్పాటు వాదాలపై మద్దతు ఇచ్చే దేశాలకు ఇది ఒక పాఠం. అల్బర్టా రెఫరెండమ్‌ ఫలితాలు కెనడా ఐక్యతను పరీక్షిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper