https://oktelugu.com/

IPL 2023 Team : ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్.. ఒకే దెబ్బకు ఆ టీమ్ 3వ ప్లేసులోకి..

తాజాగా గెలిచిన మ్యాచ్ తో రాజస్థాన్ ఇప్పటి వరకు 12 మ్యాచ్ ల్లో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టుకు 12 పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు రాజస్థాన్ రాయల్స్ జట్టుది మెరుగ్గా ఉండడంతో మూడో స్థానాన్ని పొందింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 12, 2023 / 01:26 PM IST
    Follow us on

    IPL 2023 Team: తాజా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు గొప్ప విజయాలను అందించి పెడుతున్నారు. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సత్తా చాటడంతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా పాయింట్లు పట్టికలో ముందుకు దూసుకెళ్లడంతోపాటు పర్పుల్ క్యాప్ ను ఈ జట్టు ఆటగాడు అందుకోగా, ఆరెంజ్ క్యాప్ అందుకున్నంత పని చేశాడు మరో ఆటగాడు.
    కోల్  కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్లు తేడాతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది రాజస్థాన్ జట్టు. వరసగా మూడు మ్యాచ్ ల వాటముల తర్వాత అద్భుత విజయాన్ని నమోదు చేసింది రాజస్థాన్ జట్టు. రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి ఐదు మ్యాచ్ ల్లో నాలుగు ఓటములతో నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. అయితే గురువారం కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో నెట్ రన్ రేటు భారీగా పెరిగిపోయింది. కోల్ కతా జట్టు విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 13.1 ఓవర్లోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది. మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.
    భారీగా పెరిగిన నెట్ రన్ రేట్ తో రేటుతో మూడో స్థానానికి.. 
    రాజస్థాన్ జట్టు యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆట తీరుతో జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు.  జైస్వాల్ 47 బంతుల్లోనే 98 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు వేగంగా లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తాజాగా గెలిచిన మ్యాచ్ తో రాజస్థాన్ ఇప్పటి వరకు 12 మ్యాచ్ ల్లో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టుకు 12 పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు రాజస్థాన్ రాయల్స్ జట్టుది మెరుగ్గా ఉండడంతో మూడో స్థానాన్ని పొందింది. శుక్రవారం రాత్రి గుజరాత్ – టైటాన్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తే తిరిగి మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్ ల్లో 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
    ఆరెంజ్ క్యాప్ కు దగ్గరగా జైస్వాల్..
    గురువారం నాటి మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ జట్టు యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్.. 13 బంతుల్లోనే అర్థ సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీగా ఇది రికార్డ్ అయింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో జైస్వాల్ 47 బంతుల్లోనే ఐదు సిక్సులు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ నుంచి దాదాపు ఆరంజ్ క్యాప్ తీసుకున్నంత పనిచేశాడు జైస్వాల్. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 576 పరుగులు చేయగా, జైస్వాల్ 12 మ్యాచ్ లో ఒక సెంచరీ, నాలుగు అర్ద సెంచరీలు సహా 575 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ నాటౌట్ గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు స్కోర్ తక్కువగా చేయడంతో రాజస్థాన్ జట్టు విజయాన్ని సాధించి.. జైస్వాల్ మరిన్ని పరుగులు చేయడానికి అవకాశం లేకుండా చేసింది. లేకపోతే మరిన్ని పరుగులు ఉంటే ఆరెంజ్ క్యాప్ ను జైస్వాల్ అందుకునే అవకాశం ఉండేది. ఇకపోతే గుజరాత్ జట్టు ఓపెనర్ సుబ్ మన్ గిల్ 11 మ్యాచ్లోనే 469 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్ తో గుజరాత్ జట్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో మరిన్ని పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ కు దగ్గరగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
    పర్పుల్ క్యాప్ దక్కించుకున్న యజ్వేంద్ర చాహల్..
    కోల్ కతా జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ స్పిన్నర్ యజ్వెంద్ర చాహాల్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో చాలా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తీసుకున్నాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు జాబితాలో చాహాల్ టాప్ లోకి దూసుకు వెళ్ళాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు చాహాల్ 12 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్యాషన్ 11 మ్యాచుల్లో 19 వికెట్లు తీసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు మరో స్పిన్నర్ రషీద్ ఖాన్ 11 మ్యాచ్ ల్లో 19 వికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేసర్ తుషార్ దేశ్ పాండే 12 మ్యాచ్ ల్లో 19 వికెట్లు సాధించి తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఏది ఏమైనా గురువారం జరిగిన ఒకే ఒక్క మ్యాచ్తో అద్భుత విజయాన్ని నమోదు చేసుకోవడంతోపాటు ఆ జట్టు బ్యాటర్, బౌలర్ తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నారు.