India Vs Pakistan: ఏషియా కప్ లో భాగంగా ఇండియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది ఇక ఇండియాతో పాటు ఫైనల్ లో కలపడే టీం ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో గురువారం శ్రీలంక కి పాకిస్తాన్ కి మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వాళ్లు మాత్రమే ఫైనల్లో ఇండియాతో తలపడతారు. ఇప్పటికే బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది దాంతో ఈ రెండు టీమ్ ల మధ్య గట్టి పోటీ అనేది నెలకొంది.
అందులో భాగంగానే ఇప్పటివరకు ఏషియా కప్ లో ఇండియా కి పాకిస్తాన్ కి మధ్య ఫైనల్ మ్యాచ్ అనేది జరగలేదు దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఫైనల్ కి వస్తే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య మ్యాచ్ అనేది జరగుతుంది. అయితే ఇప్పటివరకు ఇండియా ఏషియా కప్ లో ఆరుసార్లు టైటిల్ గెలిచినప్పటికీ ఒకసారి కూడా పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ అయితే ఆడలేదు పాకిస్తాన్ కూడా రెండుసార్లు టైటిల్ గెలిచినప్పటికీ ఇండియా పాకిస్తాన్ మధ్య మాత్రం ఫైనల్ మ్యాచ్ అనేది అయితే జరగలేదు. అయితే ఈసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ లో వర్షం వచ్చి ఆ మ్యాచ్ కనక రద్దయితే చెరొక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అలా చేస్తే మెరుగైన రన్ రేట్ ఉన్న శ్రీలంక ఫైనల్ లోకి వస్తుంది అలా జరగకుండా పాకిస్థాన్ గెలిస్తే మాత్రం డైరెక్ట్ గా పాకిస్తాన్ ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మధ్య లీగ్ లో ఒక మ్యాచ్, సూపర్ ఫోర్ లో ఒక మ్యాచ్ జరిగింది.
లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ సూపర్ 4 లో మాత్రం ఇండియా 228 రన్స్ తో పాకిస్థాన్ మీద ఘన విజయం సాధించింది. అలాగే నిన్న శ్రీలంక మీద కూడా ఇండియా విజయాన్ని దక్కించుకుంది దీంతో ఏషియా కప్ లో ఇండియా వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకుంది. మరి ఫైనల్ మ్యాచ్ లో కూడా గెలిస్తే ఇండియాకి ఏడవసారి ఏషియా కప్ టైటిల్ ని అందించిన వారవుతారు… అయితే స్టార్టింగ్ లో రోహిత్ శర్మతో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటివరకు ఏషియా కప్ ఫైనల్ అనేది జరగలేదు ఇప్పుడేమైనా జరిగే అవకాశం ఉందా అని అడిగితే మే బి జరిగే అవకాశం అయితే ఉంది అని రోహిత్ శర్మ చెప్పాడు మరి రోహిత్ శర్మ చెప్పినట్లుగానే పాకిస్తాన్ ఫైనల్ కి వస్తుందా లేదా శ్రీలంక వస్తుందా అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు…